టర్కీ పరిస్థితిపై అమెరికా ఆందోళన
వాషింగ్టన్: టర్కీలో కొనసాగుతున్న సైనికతిరుగు బాటు, చెలరేగుతున్న హింస పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. టర్కీలో
ఎన్నికైన ప్రభుత్వానికి మద్ధతు ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశంలోని అన్ని రాజకీయ పక్షాలకు సూచించారు.
టర్కీ ఈ పరిస్థితిని త్వరగా అధిగమించాలని ఆయన ఆకాక్షించారు. హింసాయుత చర్యలకు చరమగీతం పాడాలని కోరారు. పరిస్థితిపై ఒబామా అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో ఫోన్ లో చర్చించారు. టర్కీలోని తమ దేశ పౌరుల భద్రత గురించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు కెర్రీ ఒబామాకు తెలిపారు. టర్కీలో సైనిక తిరుగుబాటు మూలంగా ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి చెందారు.
.