సముద్రపు దొంగలు విరుచుకుపడ్డారు
అంకారా: సముద్రపు దొంగలు విరుచుపడ్డారు. టర్కీకి చెందిన ఆయిల్ ట్యాంకర్‌పై తెగబడ్డారు. నైజీరియా కోస్తా తీరంలో పులి అనే ఆయిల్ ట్యాంకర్‌తో ఉన్న నౌకను నిలిపి ఉంచగా అనూహ్యంగా పెద్ద గుంపుగా వచ్చి దాడి చేసి అందులోని కెప్టెన్‌ను, ఆరుగురు సిబ్బందిని ఎత్తుకెళ్లిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టర్కీకి చెందిన కాప్టానోగ్లూ అనే షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ గల నౌకపై పైరేట్స్ దొంగతనానికి పాల్పడ్డారు. మాల్టా జెండాతో ఉన్న ఈ పులి ఆయిల్ ట్యాంకర్ ఐవరీ తీరంలోని అబిద్ జాన్, గాబన్ ప్రాంతాల నుంచి ఈ నౌక నైజీరియా వైపునుంచి వస్తుండగా ఈ దాడి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.