‘పతంజలి ఆధ్వర్యంలో పరిశ్రమ ఏర్పాటు’
నిజామాబాద్: మంచి పారిశ్రామిక విధానం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎంపీ కవిత అన్నారు. అందులో భాగంగానే టెక్స్టైల్ పార్కు తదితర పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, జిల్లాలో పతంజలి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఆ సంస్థ సీఈఓ బాలకృష్ణ మంగళవారం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కవిత మాట్లాడుతూ జిల్లాలో స్థలాలు పరిశీలించి పసుపు ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. పతంజలి సీఈఓ బాలకృష్ణ మాట్లాడుతూ ఈ విషయంపై తమ సంస్థ దృష్టిపెట్టి రైతులకు లబ్ధి చేకూర్చేందుకు కృషి చేస్తుందన్నారు.