breaking news
tv channel changing
-
నజ్నిన్ మున్నీని ఉద్యోగం నుంచి ఊడబీకండి.. లేదంటే తగలబెట్టేస్తాం
ఢాకా: బంగ్లాదేశ్ టేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయంలో యువకుల గుంపు వీరంగం సృష్టించింది. మీ హెడ్ ఆఫ్ న్యూస్ నజ్నిన్ మున్నీని వెంటనే తొలగించకపోతే కార్యాలయాన్ని తగలబెడతాం’ అని వారు హెచ్చరించారు.సుమారు 7–8 మంది యువకులు కార్యాలయానికి వచ్చి, మున్నీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రోథోమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాల మాదిరిగానే మీ కార్యాలయాన్ని కూడా తగలబెడతాం’ అని వారు స్పష్టంగా బెదిరించారు.ఈ గుంపు తమను యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్మెంట్ సభ్యులమని చెప్పుకున్నప్పటికీ, ఆ సంస్థ అధ్యక్షుడు రిఫాత్ రషీద్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.గత వారం ప్రముఖ పత్రికలు ప్రోథోమ్ ఆలో మరియు డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరగడం, ఆ తరువాత గ్లోబల్ టీవీపై బెదిరింపులు రావడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నజ్నిన్ మున్నీ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ.. 7–8 మంది నా కార్యాలయానికి వచ్చి, నేను ఉద్యోగం వదిలిపెట్టకపోతే కార్యాలయాన్ని తగలబెడతామని బెదిరించారు’అని వెల్లడించారు. ఆమె ఈ బెదిరింపులు మీడియాను భయపెట్టే ప్రయత్నంలో భాగమని పేర్కొన్నారు.ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ప్రెస్ ఫ్రీడమ్‌పై ఉన్న ముప్పును మరోసారి బయటపెట్టింది. పత్రికా కార్యాలయాలపై దాడులు, టీవీ ఛానెల్‌లపై బెదిరింపులు జరగడం ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు పెద్ద సవాలుగా మారింది. అంతర్జాతీయ వర్గాలు ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. -
టీవీ చానల్ మార్చినందుకు గొడవ.. ఆత్మహత్య
హైదరాబాద్ : తనకు ఇష్టమైన టీవీ చానల్ చూసే విషయంలో తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కురుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని సంజయ్‌నగర్‌లో నివసించే షహానాబేగం(16) నిమ్రా కాలేజిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. గత ఆదివారం ఇంట్లో టీవీ చూస్తుండగా తమ్ముడు సమీర్ తనకు ఇష్టమైన చానల్ మారుస్తూ షహానాను ఇబ్బంది పెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చానల్ మార్చిందంటూ కోపం పట్టలేక సమీర్ అక్క షహానాను కొట్టాడు. దీనిపై తల్లి కూడా.. టీవీ చూస్తూ కాలక్షేపం చేయకపోతే ఇంట్లో పని చేయవచ్చు కదా అంటూ కోప్పడింది. దీంతో మనస్తాపానికి గురైన షహానా తన గదిలోకి వెళ్లి చున్నీతో ఉరి వేసుకొంది. కొద్దిసేపటి తర్వాత మరో సోదరి ఆ గదిలోకి వెళ్లగా ఉరికి వేలాడుతున్న చెల్లెలు కనిపించింది. వెంటనే తల్లిదండ్రులు ఆమెను ఎర్రగడ్డలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ షహానాబేగం సోమవారం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.


