‘ఐసిస్ త్రయం’పై మరో కేసు
టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఓ జాతీయ చానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో వివాదా స్పద, తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఐసిస్ సానుభూతిపరులు అబ్దుల్లా బాసిత్ తోపాటు సల్మాన్ మొయినుద్దీన్, హన్నన్ ఖురేషీపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు బుధవారం రాత్రి కేసు నమోదు చేశారు. సదరు స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన చానల్‌తోపాటు రిపోర్టర్‌కు కూడా గురువారం నోటీసులు జారీ చేశారు. ఆపరేషన్‌కు సంబంధించిన పూర్తి ఫీడ్ పరి శీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసు కోవాలని నిర్ణయించామని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు.
బీటెక్ విద్యార్థి అబ్దుల్లా బాసిత్ స్వస్థలం హైదరా బాద్‌లోని చాంద్రాయణగుట్ట. దేశ సరిహద్దు లు దాటి బంగ్లాదేశ్‌లోకి వెళ్లేందుకు యత్నిం చిన బాసిత్, అతడి స్నేహితుడు హన్నన్ ఖురేషీతోసహా నలుగురు నగర యువకు లను పోలీసులు గతంలో కోల్‌కతాలో పట్టు కున్నారు. నగరానికి చెందిన సల్మాన్ మొహి యుద్దీన్ సిరియాకు వెళ్లే క్రమంలో 2015 జనవరి 16న శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు సల్మాన్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న బాసిత్, సల్మా న్తోపాటు హన్నన్ ఖురేషీలపై ఓ జాతీయ చానల్ స్టింగ్ ఆపరేషన్ చేసి ప్రసారం చేసింది. ఇందులో బాసిత్ చేసిన అభ్యం తరకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ వీడియోల్లో కనిపించి, మాట్లాడిన సల్మాన్, ఖరేషీలపై పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు.