tv serial shooting
-
బంజారాహిల్స్: టీవీ సీరియల్ మేనేజర్‌పై కేసు
సాక్షి, బంజారాహిల్స్: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు తీసుకోకుండా సమూహాలుగా ఏర్పడి టీవీ షూటింగ్‌ను నిర్వహిస్తున్న ఘటనలో తెలుగు టీవీ ప్రొడక్షన్ మేనేజర్ కె.ప్రవీణ్‌కుమార్(34)పై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బుధవారం మధ్యాహ్నం ఫిలింనగర్‌లోని సాయిబాబా టెంపుల్ వద్ద మంగమ్మగారి అబ్బాయి మా టీవీ తెలుగు సీరియల్ షూటింగ్ జరుగుతుండగా సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ రవిరాజ్ సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. సుమారుగా 18 మంది వరకు ఈ షూటింగ్లో పాల్గొని కోవిడ్–19 మార్గదర్శకాలు పాటించకుండా షూటింగ్ నిర్వహించారని గుర్తించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఉండటంతో పాటు ఏ ఒక్కరూ కూడా మాస్క్‌లు ధరించలేదని తెలిపారు. ఈ టీవీ సీరియల్ మేనేజర్ కె.ప్రవీణ్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 188, 269, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. -
కొత్తగా.. వింతగా ఉంది
సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం నగరంలో టీవీసీరియళ్ల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి కరోనా నిబంధనల మధ్య..మళ్లీ తారల తళుకులు, కెమెరాల ఫ్లాష్‌లు, టెక్నీషియన్ల హడావుడితో సెట్లో సందడి కన్పించింది. జూబ్లీహిల్స్: దాదాపు మూడునెలల విరామం తర్వాత తారలు తళుక్కుమంటున్నారు. కెమెరా ఫ్లాష్‌లు, లైట్‌బాయ్‌లు, క్లాప్‌లు, మేకప్ మ్యాన్లు, టెక్నీషియన్ల హడావుడి మధ్య కోట్లాదిమంది నిత్యం చూసే టీవీ సీరియళ్ల షూటింగ్ సందడి ఆదివారం నగరంలో ప్రారంభమైంది. కరోనా నిబంధనలు, ఆంక్షల మధ్య శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరంతో పనిచేయడం తదితర పక్కా రక్షణ ఏర్పాట్లతో షూటింగ్ ప్రారంభించినట్లు దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మేరకు ఫిలింనగర్లో నిర్వహిస్తున్న రక్తసంబంధం టీవీ సీరియల్ బృందాన్ని ‘సాక్షి’ పలకరించగా వారు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. కొత్తగా.. వింతగా ఉంది మూడునెలల తర్వాత షూటింగ్‌లు ప్రారంభం కావడంతో అంతా కొత్తగా.. వింతగా ఉంది. షూటింగ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. అదే సమయంలో భయంగా కూడా ఉంది. ఏదిఏమైనా జీవితం ముందుకు సాగాలి. ప్రతిఒక్కరూ పనిచేయక తప్పదు. పూర్తిస్థాయి జాగ్రత్తలతో షూటింగ్లో పాల్గొంటున్నాం. – జాకీ, నటుడు అన్ని జాగ్రత్తలతో.. మూడు నెలలుగా ఇంట్లోనే ఉండి లాక్డౌన్ సమయంలో కుటుంబంతో ఎక్కువ కాలం గడిపే అవకాశం దొరికింది. ఇష్టమైన వంటలు చేసుకుంటూ బంధుమిత్రులతో వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ హాయిగానే గడిపాం. ఇక జీవనోపాధి తప్పనిసరి. అన్ని జాగ్రత్తలతో షూటింగ్లో పాల్గొంటున్నాం. – జ్యోతిరెడ్డి, సీరియల్ నటి నిబంధనల మేరకు షూటింగ్ ప్రభుత్వ నిబంధనల మేరకు షూటింగ్ చేస్తున్నాం. షూటింగ్ ప్రదేశాన్ని పూర్తిగా శానిటైజ్ చేస్తున్నాం. నటులు, సిబ్బందికి థర్మల్ స్క్రీనింగ్ చేసి అనుమతిస్తున్నాం. మాస్క్‌లు తప్పనిసరి చేశాం. ఆహారం కూడా జాగ్రత్తగా సిద్ధం చేస్తున్నాం. పీపీఈ కిట్లు ధరించిన మేకప్ సిబ్బంది నటీనటులకు మేకప్ చేస్తున్నారు.– సర్వేశ్వర్‌రెడ్డి, సీరియల్ నిర్మాత -
టీవీ సీరియళ్లకు ప్రభుత్వం అనుమతి
చెన్నై: టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, బుల్లితెర నిర్మాతల మండలి అధ్యక్షురాలు సుజాత విజయ్‌కుమార్, కార్యదర్శి కుష్బూ తదితరులు సీఎంకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. 20 మంది సభ్యులతో కూడిన షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమ తి ఇచ్చింది. అయితే ఇది సాధ్యం కాదని, కనీసం 60 మంది సభ్యులతో టీవీ షూటింగ్‌లు నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు 60 మంది సభ్యులతో షూటింగ్‌లు జరుపుకోవడానికి ముఖ్యమంత్రి శనివారం అనుమతిచ్చినట్టు ప్రకటించారు. షూటింగ్ నిర్వహించే ప్రాంతా ల్లో ఆయా జిల్లాల అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని నిబంధనలు విధించారు. ఆదివారం నుంచే సీరియళ్ల షూటింగ్‌లను నిర్వ హించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. చదవండి: మరో మన్మథుడు.. యుక్త వయస్సు మహిళలే టార్గెట్ -
రోడ్డుపై షూటింగ్.. ట్రాఫిక్ జామ్
కృష్ణరాజపుర(బెంగళూరు): నిరంతరం ట్రాఫిక్ రద్దీగా ఉండే టిన్ ఫ్యాక్టరీ వద్ద సోమవారం జాతీయ రహదారిలో అనుమతి లేకుండా టీవీ సీరియల్ చిత్రీకరణ చేయడంతో సుమారు రెండు కిలోమీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఐటీఐ ఊయల వంతెన పైభాగంలో ఒక రోడ్డుపై టీవీ సీరియల్ బృందమొకటి చిత్రీకరణ చేస్తుండటంతో మరో రోడ్డు నుంచి షూటింగ్ చూసేందుకు కొందరు వాహనాలను నిలపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక టిన్ ఫ్యాక్టరీ రోడ్డు, హెబ్బాళ, ఐటీపీఎల్, ఆనేకల్, తిరుపతి తదితర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రముఖ నగరాలకు వెళ్లే అన్ని వాహనాలూ ఇదే మార్గంగుండా సంచరిస్తాయి. దీంతో ప్రతినిత్యం ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. షూటింగ్‌కు వచ్చిన సీరియల్ బృందం అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మండుతున్న ఎండలో ప్రయాణికులను రద్దీలో ఇరికించడంతో వాహన చోదకుల ఆగ్రహానికి కారణమైంది. కిలోమీటర్ల పొడవునా ఏర్పడిన రద్దీతో ప్రయాణికులు పడిన పాట్లు వర్ణనాతీతం. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు షూటింగ్‌ను నిలిపివేయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.