అంధుల క్రికెట్ విజేత టీవీ టవర్స్ జట్టు
హుడా కాంప్లెక్స్, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి అంధుల క్రికెట్ టోర్నమెంట్‌ను మూసారంబాగ్ టీవీ టవర్ జట్టు గెలుచుకుంది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వైజాగ్ టీమ్‌పై నాలుగు వికెట్ల తేడాతో మూసారంబాగ్ టీవీ టవర్స్ నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన టీవీ టవర్స్ 10 ఓవర్లలో 113 పరుగులు సాధించింది.
అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వైజాగ్ టీమ్ 10 ఓవర్లలో 110 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి ఉండగా 17 పరుగులు సాధించి 2 వికెట్లను కోల్పోయింది. విజేతకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ.15 వేలు, రన్నరప్‌కి రూ.10వేల నగదు అందించారు.