కశ్మీర్ అల్లర్లకు పాక్ నిధులు
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్లో అల్లర్లను ప్రేరేపించడానికి పాకిస్థాన్ పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు కశ్మీర్లో అశాంతిని సృష్టించేందుకు ఆ దేశం రూ.24 కోట్లను ఖర్చు చేసిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వేర్పాటు వాదులకు జమాతే ఇస్లామీ, దుఖ్ త్రనన్ ఈ మిల్లత్ సంస్థల ద్వారా నిధులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆందోళనను ఉదృతం చేసేందుకే పొరుగు దేశం నిధులను పంపిణీ చేసిందని వెల్లడించారు.