క్రేజీక్రేజీ క్యాట్‌వాక్
పెదవాల్తేరు: క్యూట్‌క్యూట్‌గా హాట్‌హాట్‌గా అందమైన భామలు క్యాట్‌వాక్ చేశారు. కళ్లుచెదిరే అందాలతో విరబూసిన పుష్పాల్లా వావ్ అనిపించారు. కలర్‌ఫుల్ శారీస్‌తో..గాగ్రాలతో కేక పుట్టించారు. వారికి పోటీగా హ్యాడ్సమ్ గైయ్స్ వెరైటీ గెటప్స్‌తో మైమరిపించారు. ఈ క్రేజీ ఈవెంట్‌కు హోటల్ గ్రీన్‌పార్కు వేదికైంది. ట్విలైట్ ఈవెంట్ మేనేజ్మెంట్ ‘మిస్టర్ అండ్ మిస్ పర్ఫెక్ట్–2016’ పోటీల్లో భాగంగా గ్రాండ్ ఫినాలే ఆదివారం జరిగింది. వయ్యారి హంస నడకలతో బ్యూటీలంతా సత్తా చాటారు. లైట్ మ్యూజిక్...కళ్లుచెదిరే లేజర్ లైటింగ్ మధ్య తారల్లా మెరిసిపోయారు. మిస్టర్ అండ్ మిస్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని కైవసం చేసుకునేందుకు యువతీ,యువకులు పోటీపడ్డారు. ఐదు విభాగాల్లో ఈపోటీలను నిర్వహించారు. క్యాట్‌వాక్ మధ్యలో వెస్ట్రన్ డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. ప్రఖ్యాత ట్రై నర్ అరుణ్ రతన్ 28 మంది మోడల్స్‌కు శిక్షణ ఇచ్చారు. ఈవెంట్‌కు న్యాయనిర్ణేతలుగా మిస్‌యూనివర్స్–2015 నోయోతాలోథ్, మిస్టర్ గ్లోబల్ ఫణికుమార్ వ్యవహరించారు. స్పెషల్ అంట్రాక్షన్గా సింగర్స్ రేవంత్, దామిని, సాహితి తనగానామతంతో హుషారెత్తించారు. కార్యక్రమంలో నటుడు ఆదిత్య ఓం పాల్గొన్నారు.