two medals
-
Paris Olympics 2024: ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత బృందం పతాకధారిగా మనూ భాకర్
పారిస్ ఒలింపిక్స్‌లో తన అద్భుత ప్రదర్శన ద్వారా దేశానికి రెండు పతకాలు అందించిన స్టార్ షూటర్ మనూ భాకర్‌కు మరో గౌరవం దక్కింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కిన మనూ... ‘పారిస్’ క్రీడల ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరించ నుంది. ఈనెల 11న జరగనున్న ముగింపు వేడుకల్లో మనూ.. జాతీయ జెండా చేబూని భారత బృందాన్ని నడిపించనుంది. ‘ముగింపు వేడుకల్లో మనూ ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనుంది. దీనికి భాకర్ పూర్తి అర్హురాలు’ అని భారత ఒలింపిక్ సంఘం తెలిపింది. ఒలింపిక్స్ ఆరంభ వేడుకల్లో స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ ఆచంట శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. ముగింపు వేడుకల్లో ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించనున్న పురుష అథ్లెట్ పేరు తర్వాత ప్రకటించనున్నారు. -
రెండు పతకాలపై ధీరజ్ గురి
అంటాల్యా (టర్కీ): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీ పురుషుల రికర్వ్ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్ రెండు పతకాల రేసులో నిలిచాడు. రికర్వ్ మిక్స్డ్ విభాగంలో భజన్ కౌర్‌తో కలిసి ధీరజ్ ఆదివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. దాంతోపాటు పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలోనూ ధీరజ్ సెమీఫైనల్ చేరుకున్నాడు. వ్యక్తిగత విభాగం క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 7–3 (28–29, 28–27, 29–29, 28–27, 30–27)తో వెటెర్ (జర్మనీ)పై గెలిచాడు. మిక్స్డ్ విభాగం సెమీఫైనల్లో ధీరజ్–భజన్ కౌర్ ద్వయం 3–5 (37–34, 36–38, 37–37, 36–38)తో జెన్ హన్‌యంగ్–లీ వూసియోక్ (కొరియా) జంట చేతిలో ఓడింది. -
44 ఏళ్ల తర్వాత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర...
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, లక్ష్య సేన్ ఎవరూ ఊహించని అద్భుతం చేశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్‌లో ఒకేసారి భారత్‌కు రెండు పతకాలను ఖాయం చేశారు. వీరిద్దరూ సెమీఫైనల్లో ముఖాముఖిగా తలపడనున్నారు. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల ఈ మెగా ఈవెంట్ చరిత్రలో తొలిసారి పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ఫైనల్‌కు చేరుకోవడం ఖాయమైంది. అంతా అనుకున్నట్లు జరిగితే పురుషుల సింగిల్స్‌లో తొలిసారి భారత ప్లేయర్ ప్రపంచ చాంపియన్ అయ్యే అవకాశం కూడా ఉంది. కాగా మహిళల సింగిల్స్‌లో 2019లో పీవీ సింధు విశ్వవిజేతగా నిలిచింది. హుఎల్వా (స్పెయిన్): రెండు నెలల క్రితం థామస్ కప్‌లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేసేందుకు నిర్వహించిన సెలెక్షన్ టోర్నీ మ్యాచ్‌లో ఓడిపోయి జాతీయ జట్టులో స్థానం కోల్పోయిన యువతార లక్ష్య సేన్... నిలకడలేని ఆటతీరుతో గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా నెగ్గలేకపోయిన ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ కొత్త చరిత్ర సృష్టించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్, లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. భారత కాలమానం ప్రకారం నేటి రాత్రి పది గంటలకు మొదలయ్యే సెమీఫైనల్లో శ్రీకాంత్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడతారు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్ శ్రీకాంత్ కేవలం 26 నిమిషాల్లో 21–8, 21–7తో ప్రపంచ 28వ ర్యాంకర్ మార్క్ కాల్జూ (నెదర్లాండ్స్)ను చిత్తు చేయగా... ప్రపంచ 19వ ర్యాంకర్ లక్ష్య సేన్ 67 నిమిషాల్లో 21–15, 15–21, 22–20తో 42వ ర్యాంకర్ జావో జున్ పెంగ్ (చైనా)పై గెలిచాడు. జున్ పెంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిర్ణాయక మూడో గేమ్‌లో లక్ష్య సేన్ 19–20 వద్ద మ్యాచ్ పాయింట్ కాపాడుకోవడం విశేషం. ఈ స్కోరు వద్ద ఒక్కసారిగా దూకుడుగా ఆడిన లక్ష్య సేన్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ ప్రణయ్ కూడా గెలిచి ఉంటే భారత్‌కు మూడో పతకం ఖరారయ్యేది. కానీ క్వార్టర్ ఫైనల్లో కీన్ యియు (సింగపూర్) 21–14, 21–12 తో ప్రణయ్‌ను ఓడించి రెండో సెమీఫైనల్లో ఆంటోన్సెన్ (డెన్మార్క్)తో పోరుకు సిద్ధమయ్యాడు. సింధుకు నిరాశ... మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు పోరాటం ముగిసింది. ప్రపంచ నంబర్‌వన్ తై జు యింగ్ (చైనీస్ తైపీ)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 17–21, 13–21తో ఓడిపోయింది. తై జు చేతిలో సింధు ఓడటం ఇది 15వ సారి. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో పతకాలు నెగ్గిన భారత క్రీడాకారుల సంఖ్య. గతంలో ప్రకాశ్ పదుకొనే (1983లో), సాయిప్రణీత్ (2019లో) కాంస్య పతకాలు నెగ్గారు. ఈసారి లక్ష్య సేన్, శ్రీకాంత్‌లలో ఒకరికి కనీసం రజతం లేదా స్వర్ణం... మరొకరికి కాంస్య పతకం ఖరారు కానుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ నెగ్గిన మొత్తం పతకాలు. మహిళల సింగిల్స్‌లో సింధు ఐదు పతకాలు (ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు), సైనా నెహ్వాల్ రెండు పతకాలు (ఒక కాంస్యం, ఒక రజతం) సాధించారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్ప జంట ఒక కాంస్యం గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో ప్రకాశ్ పదుకొనే, సాయిప్రణీత్ ఒక్కో కాంస్యం నెగ్గారు. శ్రీకాంత్, లక్ష్య సేన్ కూడా ఒక్కో పతకం ఖరారు చేశారు. -
Tokyo Paralympics: చివరి రోజు భారత్ ఖాతాలో స్వర్ణం
-
మీరాబాయి ప్రపంచ రికార్డు
తాష్కెంట్ (ఉజ్బెకిస్తాన్): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా లిఫ్టర్ సైఖోమ్ మీరాబాయి చాను (49 కేజీలు) రెండు పతకాలను సొంతం చేసుకుంది. శనివారం మొదలైన ఈ మెగా ఈవెంట్లో మీరాబాయి క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో స్వర్ణం... ఓవరాల్‌గా కాంస్య పతకం సాధించింది. క్లీన్ అండ్ జెర్క్ ఈవెంట్లో మీరాబాయి 119 కేజీల బరువెత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 118 కేజీలతో హుయ్‌హువా జియాంగ్ (చైనా) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును మీరాబాయి బద్దలు కొట్టింది. స్నాచ్‌లో మీరాబాయి 86 కేజీలు బరువెత్తి ఈ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచింది. మొత్తంగా మీరాబాయి (86+119) 205 కేజీలు బరువెత్తి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 213 కేజీలతో (స్నాచ్‌లో 96+క్లీన్ అండ్ జెర్క్‌లో 117) జిహుయ్ హౌ (చైనా) స్వర్ణం... 207 కేజీలతో (స్నాచ్‌లో 89+క్లీన్ అండ్ జెర్క్‌లో 118) హుయ్‌హువా జియాంగ్ రజతం సాధించారు. ఈ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఒక పతకం ఇవ్వకుండా... స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్, టోటల్ విభాగాలకు వేర్వేరు పతకాలు అందజేస్తున్నారు. -
‘టీమ్’ ఈవెంట్లలో మరో 2 పతకాలు
న్యూఢిల్లీ: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో ఏడో రోజు గురువారం భారత్‌కు మరో రెండు పతకాలు లభించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో చింకీ యాదవ్, రాహీ సర్నోబత్, మనూ భాకర్‌లతో కూడిన భారత జట్టు 17–7తో వార్జోనొస్కా, జులిటా బోరెక్, అగ్నీస్కా కొరెజ్వోలతో కూడిన పోలండ్ జట్టుపై గెలిచింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ విభాగంలో అంజుమ్ మౌద్గిల్, శ్రేయ సక్సేనా, గాయత్రి నిత్యానందమ్లతో కూడిన భారత జట్టు ఫైనల్లో 43–47తో అనెటా స్టాన్కివిచ్, అలెక్సాండ్రా, నటాలియా కొచనస్కాలతో కూడిన పోలండ్ చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ప్రస్తుతం భారత్ 10 స్వర్ణాలు, 6 రజతాలు, 5 కాంస్యాలు సహా మొత్తం 21 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ‘మావాడితో కలిసి ఆడం’ ప్రత్యర్థి ఆటగాళ్లపైనో, వారి నిబంధనల ఉల్లంఘనపైనో మరో జట్టు ఆటగాళ్లు ఫిర్యాదులు చేయడం, పరిష్కారానికి నిర్వహకులు జోక్యం చేసుకోవడం చాలా టోర్నీలలో సహజంగా కనిపించే విషయం. అయితే అందుకు భిన్నంగా తమ జట్టు సహచరుడిపైనే మరొకరు ఫిర్యాదు చేసి అతనితో కలిసి బరిలోకి దిగేందుకు నిరాకరించడం విశేషం. మరికొద్ది నిమిషాల్లో పోటీ అనగా... హంగేరీ షూటర్లు ఇస్తవాన్ పెని, జవన్ పెక్లర్ తమ తోటి షూటర్ పీటర్ సిడీ నిబంధనలకు విరుద్ధంగా ‘బైపాడ్’ అతికిచ్చి ఉన్న రైఫిల్‌తో పోటీలో పాల్గొంటున్నాడని ఆరోపిస్తూ తాము ఫైనల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనిపై స్పందించిన ఐఎస్ఎస్ఎఫ్ అధికారులు మాత్రం అతను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా రూల్స్ విషయంలో తమకు హంగేరీ ప్లేయర్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదంటూ ఘాటుగా స్పందించారు. అయితే నిబంధనలకంటే ఆటగాళ్ల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. సిడీ 2000నుంచి వరుసగా 5 ఒలింపిక్స్‌లో పాల్గొనగా, ఇస్తవాన్ పెని ప్రస్తుతం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్నా డు. తాజా వివాదంతో భారత్‌తో ఫైనల్లో పోటీ పడేందుకు అమెరికా అర్హత సాధించగా...ఫైనల్‌ను నేటికి వాయిదా వేశారు. -
దివ్యా రెడ్డికి రెండు పతకాలు
ఆసియా మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ మహిళా అథ్లెట్ దివ్యా రెడ్డి రెండు పతకాలు సాధించింది. మలేసియాలోని సారావక్‌లో జరుగుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో దివ్యా రెడ్డి 40 ఏళ్ల వయో విభాగంలో 800 మీటర్ల కేటగిరీలో విజేతగా నిలిచి స్వర్ణం సొంతం చేసుకోగా... 400 మీటర్ల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 800 మీటర్ల ఫైనల్లో దివ్యా రెడ్డి అందరికంటే ముందుగా 2 నిమిషాల 53.64 సెకన్లలో గమ్యానికి చేరి చాంపియన్‌గా అవతరించింది. గో తెంగ్ యిన్ (మలేసియా– 2ని:54.15 సెకన్లు) రజతం... అమితా కనెగాంకర్ (భారత్–2ని:54.73 సెకన్లు) కాంస్యం సాధించారు. -
పసిడి పంట
కఠ్మాండు (నేపాల్): దక్షిణాసియా క్రీడల్లో రెండో రోజు భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ క్రీడాంశాల్లో తమ ఆధిపత్యాన్ని చాటుకొని పతకాలు సొంతం చేసుకున్నారు. ఓవరాల్‌గా రెండో రోజు మంగళవారం భారత్‌కు 27 పతకాలు లభించాయి. ఇందులో 13 స్వర్ణాలు ఉన్నాయి. టేబుల్ టెన్నిస్ (టీటీ) టీమ్ ఈవెంట్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతకాలు నెగ్గాయి. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ సభ్యురాలిగా ఉన్న భారత టీటీ మహిళల జట్టు ఫైనల్లో 3–0తో శ్రీలంకను ఓడించింది. ఫైనల్స్ మ్యాచ్‌ల్లో సుతీర్థ ముఖర్జీ 11–9, 11–7, 11–3తో ఇషారా మధురాంగిపై, కృత్విక సిన్హా రాయ్ 11–6, 11–4, 11–2తో ఇరాండి వరుస్వితానాపై, ఆకుల శ్రీజ 11–5, 11–5, 11–3తో హన్సిని పియుమిలాపై నెగ్గారు. ఆంథోని అమల్‌రాజ్, హర్మీత్ దేశాయ్, సౌమ్యజిత్ ఘోష్ సభ్యులుగా ఉన్న భారత పురుషుల టీటీ జట్టు ఫైనల్లో 3–0తో నేపాల్‌పై గెలిచింది. వాలీబాల్ ఈవెంట్లోనూ భారత జట్లకు రెండు స్వర్ణాలు దక్కాయి. ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 20–25, 25–15, 25–17, 29–27తో పాకిస్తాన్‌పై నెగ్గగా, భారత మహిళల జట్టు 25–17, 23–25, 21–25, 25–20, 15–6తో నేపాల్‌ను ఓడించింది. షూటింగ్లో భారత్‌కు 4 స్వర్ణాలు, 4 రజతాలు, కాంస్యంతో కలిపి తొమ్మిది పతకాలు వచ్చాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో మెహులీ ఘోష్... టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాలు గెలుచుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో చెయిన్ సింగ్... పురుషుల 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో యోగేశ్ సింగ్ స్వర్ణాలు సాధించారు. తైక్వాండోలో మహిళల 57 కేజీల విభాగంలో కశిష్ మలిక్ పసిడి పతకం నెగ్గింది. అథ్లెటిక్స్‌లో భారత్‌కు అర్చన సుశీంద్రన్ (మహిళల 100 మీటర్లు), జష్నా (మహిళల హైజంప్), సర్వేశ్ అనిల్ కుషారే (పురుషుల హైజంప్), అజయ్ కుమార్ సరోజ్ (పురుషుల 1500 మీటర్లు) బంగారు పతకాలు అందించారు. ఖో–ఖోలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. -
నవ్య ‘డబుల్’
సాక్షి, విజయవాడ/హైదరాబాద్: ఆద్యంతం నిలకడగా రాణించిన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కందేరి నవ్య సింగపూర్ యూత్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్లో రెండు విభాగాల్లో విజేతగా నిలిచి ‘డబుల్’ సాధించింది. సింగపూర్‌లో జరిగిన ఈ టోర్నీలో చిత్తూరు జిల్లాకు చెందిన నవ్య అండర్–13 బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టైటిల్స్ గెల్చుకుంది. సింగిల్స్ ఫైనల్లో నవ్య 21–8, 21–13తో నాలుగో సీడ్ నిసా అలిఫెనియా తానెవగస్తిన్ (ఇండోనేసియా)పై నెగ్గగా... డబుల్స్ ఫైనల్లో నవ్య–వలిశెట్టి శ్రియాన్షి (భారత్) ద్వయం 21–18, 17–21, 21–16తో సుకిత్త సువచాయ్–నారద ఉడోర్న్‌పిమ్ (థాయ్‌లాండ్) జంటను ఓడించింది. మరోవైపు ఇదే టోర్నీ బాలుర అండర్–15, అండర్–13 డబుల్స్ విభాగాల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాళ్లు కలగోట్ల లోకేశ్ రెడ్డి, తీగల సాయిప్రసాద్, నాగలింగ ప్రణవ్ రామ్ టైటిల్స్ గెలిచారు. అండర్–15 బాలుర డబుల్స్ ఫైనల్లో లోకేశ్ రెడ్డి–అంకిత్ మోండల్ (బెంగాల్) ద్వయం 25–23, 4–21, 21–18తో రెండో సీడ్ జొనాథన్ గొసాల్–అడ్రియన్ ప్రతమ (ఇండోనేసియా) జంటపై... అండర్–13 బాలుర డబుల్స్ ఫైనల్లో సాయిప్రసాద్–ప్రణవ్ రామ్ జోడీ 21–11, 21–16తో చౌ యు సియాంగ్–ఫాన్ వాన్ చున్ (చైనీస్ తైపీ) జంటపై విజయం సాధించాయి. -
పసిడి పోరుకు జ్యోతి సురేఖ జోడీ
బ్యాంకాక్ (థాయ్‌లాండ్): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు పతకాలు ఖాయమయ్యాయి. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (ఢిల్లీ) ద్వయం ఫైనల్‌కు చేరింది. సోమవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జంట 159–154తో సో చేవన్–యాంగ్ జేవన్ (దక్షిణ కొరియా) జోడీపై గెలిచింది. తొలి రౌండ్లో ‘బై’ పొందిన సురేఖ–అభిషేక్ క్వార్టర్ ఫైనల్లో 158–155తో ఆదెల్ జెన్‌బినోవా–అక్బర్ అలీ కరబయేవ్ (కజకిస్తాన్)లపై నెగ్గారు. బుధవారం జరిగే స్వర్ణ పతక పోరులో చెన్ యి సువాన్–చెన్ చెయి లున్ (చైనీస్ తైపీ)లతో సురేఖ–అభిషేక్ తలపడతారు. దీపిక–అతాను దాస్ జంటకు కాంస్యం రికర్వ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భార్యభర్తలైన దీపిక కుమారి–అతాను దాస్ జంట కాంస్య పతకం సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో దీపిక–అతాను దాస్ ద్వయం 6–2తో యిచాయ్ జెంగ్–వె షావోజువాన్ (చైనా) జోడీపై గెలిచింది. అంతకుముందు సెమీఫైనల్లో దీపిక–అతాను దాస్ 3–5తో లె చియెన్ యింగ్–సు యు యాంగ్ (చైనీస్ తైపీ)ల చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం భారత ఆర్చరీ సంఘం (ఏఏఐ)పై నిషేధం కొనసాగుతుండటంతో... ఈ టోర్నీలో భారత క్రీడాకారులు ప్రపంచ ఆర్చరీ పతాకం కింద పోటీపడుతున్నారు. -
అభిషేక్‌కు స్వర్ణం, సౌరభ్‌కు కాంస్యం
రియో డి జనీరో: ప్రపంచ కప్ షూటింగ్లో భారత్ జోరు కొనసాగుతోంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ విభాగంలో భారత్‌కు 2 పతకాలు లభించాయి. ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అయిన అభిషేక్ వర్మ బంగారు పతకంతో మెరవగా, 17 ఏళ్ల సౌరభ్ చౌదరికి కాంస్యం లభించింది. ఈ ఈవెంట్లో అభిషేక్ 244.2 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 221.9 పాయింట్లు స్కోర్ చేసిన సౌరభ్‌కు మూడో స్థానం దక్కింది. టర్కీకి చెందిన ఇస్మాయిల్ కెలెస్ 243.1 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకం అందుకున్నాడు. ప్రస్తుతం భారత్ 2 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్యంతో పతకాల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అభిషేక్, సౌరభ్ ఇద్దరూ గత క్వాలిఫయింగ్ టోర్నీలోనే రాణించి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగం క్వాలిఫయింగ్‌లో పదో స్థానంలో నిలిచిన చింకీ యాదవ్ త్రుటిలో ఫైనల్ అవకాశం చేజార్చుకుంది. -
‘బ్రిడ్జ్’లో 2 పతకాలు ఖాయం
ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టిన ‘బ్రిడ్జ్’ క్రీడలో భారత్ రెండు పతకాలు ఖాయం చేసుకుంది. భారత పురుషుల, మిక్స్డ్ టీమ్‌లు సెమీఫైనల్ చేరుకోవడంతో కనీసం రెండు పతకాలు మన ఖాతాలో చేరాయి. 13 క్వాలిఫికేషన్ రౌండ్లు ముగిసిన తర్వాత పురుషుల బ్రిడ్జ్ జట్టు నాలుగో స్థానంలో నిలవగా, మిక్స్డ్ విభాగంలో 7 క్వాలిఫయింగ్ రౌండ్ల అనంతరం మన జట్టు అగ్రస్థానం సాధించింది. సెమీస్‌లో ఓడినా భారత్‌కు కనీసం కాంస్యం దక్కుతుంది. -
సంగ్రామ్‌కు రజతం... అమన్‌కు కాంస్యం
న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత భారత షూటర్లు మళ్లీ మెరిశారు. సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్స్ టోర్నీలో తొలిసారి పాల్గొంటున్న వీరిద్దరు పతకాలు నెగ్గడం విశేషం. ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా... హు బిన్‌యువాన్ (చైనా–79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ–56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 123.2 పాయింట్లు స్కోరు చేసి ఎనిమిదో స్థానంతో సంతృప్తి పడ్డాడు. మికెక్ (సెర్బియా–229.3 పాయింట్లు), ఒమ్లెచుక్ (ఉక్రెయిన్–228 పాయిం ట్లు) స్వర్ణ, రజత పతకాలు నెగ్గారు. -
శివమ్ సైనికి స్వర్ణం
పెనాంగ్ (మలేసియా): కామన్వెల్త్ వెరుుట్లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో భారత లిఫ్టర్ శివమ్ సైనీ రెండు పతకాలు సాధించాడు. జూనియర్ విభాగంలో సైని స్నాచ్‌లో 132 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 168 కిలోలు బరువు ఎత్తి స్వర్ణం సాధించాడు. ఇక సీనియర్ 94 కేజీల విభాగంలో శివమ్ సైనీ రజతం గెలిచాడు. స్నాచ్‌లో 132, క్లీన్ అండ్ జర్క్‌లో 168లతో మొత్తం 300 కిలోల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు. -
ఆటాడుకుందాం..రా
వలంటీర్ల తరహాలో పీఈటీలు ∙జిల్లాలో 275 మంది నియామకం పాపన్నపేట:ఒలింపిక్ క్రీడా ఫలితాలు అధికారుల కళ్లు తెరిపించాయి. జనాభా పరంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న భారత్ ఒలింపిక్ క్రీడల్లో ఉనికి చాటుకునే ప్రయత్నంలో రెండు పతకాలు సాధించడం కొంతలో కొంత ఊరట కలిగించింది. ముఖ్యంగా రెజ్లింగ్‌లో సాక్షిమాలిక్ కాంస్యం, బ్యాడ్మింటలో తెలుగు తేజం సింధు రజత పతకం పొంది.. పోరాడితే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఈ తరహా ‘సక్సెస్ ఆటిట్యూడ్’ను చిన్నప్పటి నుండే పిల్లలకు నేర్పాలన్న సందేశాన్ని వీరు సాధించిన విజయం అందించింది. దీంతో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో పీఈటీలను నియమించి గ్రామీణ స్థాయి నుంచే మెరికల్లాంటి క్రీడాకారులనుతీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. వందకు పైగా విద్యార్థులున్న స్కూళ్లలో వలంటీర్ పీఈటీలను నియమించేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆటలు అటకెక్కాయి..మెదక్ జిల్లాలో మొత్తం 508 ఉన్నత పాఠశాలలు, 416 ప్రాథమికోన్నత, 1,907 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీలు, ఆట స్థలాలు ఉండాలి. కాని మెదక్ జిల్లాలో 759 పాఠశాలలకు మైదానాలు లేవు. మొత్తం 162 మంది పీఈటీలు, 63 ఫిజికల్ డైరక్టర్లు ఉండగా మిగతా పాఠశాలల్లో పీఈటీలు లేరు. దీంతో వేలాది మంది విద్యార్థులను ఆటలాడించే పరిస్థితి లేదు. మొక్కుబడిగా క్రీడలు.. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో క్రీడలకు పీరియడ్లు కేటాయించాలి. కాని చాలా చోట్ల పీఈటీలు, వసతులు లేక ప్రత్యేక పీరియడ్లు కేటాయించడం లేదన్న విమర్శలున్నాయి. కేవలం 15 ఆగస్టు, 26 జనవరికి మాత్రమే మొక్కుబడిగా ఆటలాడిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో మండల స్థాయి టోర్నమెంట్లు జరిగేవి. కాని ప్రస్తుతం పైకా (పంచాయతీ యువ ఖేల్ అభియా¯ŒS) పేరిట క్రీడాకారుల ఎంపికలు మాత్రమే జరుగుతున్నాయి. అలాగే క్రీడల కోసం ప్రత్యేక నిధులు పాఠశాలలకు మంజూరు కావడం లేదు. ఉన్నత పాఠశాలలకు ఆర్‌ఎంఎస్‌ఏ కింద ఏటా వచ్చే రూ.7,500లలో లైబ్రరీ పుస్తకాలు, క్రీడా సామగ్రి కొనుగోలుకు అవకాశం ఉంది. వంద మంది విద్యార్థులు దాటితే పీఈటీ క్రీడలకు పెద్దపీట వేసే లక్ష్యంతో మొదట వంద మందికి పైగా విద్యార్థులున్న ఉన్నత పాఠశాలల్లో వలంటీర్ పీఈటీలను నియమించాలని పాఠశాల విద్యా డైరక్టర్ కిష¯ŒS ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో సుమారు 275 మంది పీఈటీలు నియామకమయ్యే అవకాశం ఉంది. సెస్టెంబర్ 1 కల్లా వీరిని నియమించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆటలకు నిధులు కేటాయించాలి: పీడీ శ్రీధర్‌రెడ్డి ప్రతి పాఠశాలలో ఆటలకు నిధులు మంజూరు చేయాలి. క్రీడలకు ఒక పీరియడ్ విధిగా కేటాయించాలి. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు పీఈటీని నియమించాలి. మండల స్థాయి టోర్నమెంట్లు నిర్వహించాలి. ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలి: మధు, పీఈటీ క్రీడాకారులకు ఉద్యోగాల్లో, ప్రొఫెషనల్ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించాలి. ప్రభుత్వం తరపున క్రీడా సామగ్రి పంపిణీ చేయాలి. మండల స్థాయిలో స్టేడియంలు నిర్మించి, కోచ్‌లను నియమించాలి. -
విజయ్‌కు రెండు పతకాలు
ఆసియా షూటింగ్ కువైట్ సిటీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో మేటి షూటర్ విజయ్ కుమార్‌కు రెండు పతకాలు లభించాయి. 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో విజయ్‌కు కాంస్యం దక్కింది. టీమ్ విభాగంలో సమరేశ్ జంగ్, పెంబా తమాంగ్, విజయ్‌ల త్రయం 1736 పాయింట్లతో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీల్లో భారత్ 17 స్వర్ణాలు, 14 రజతాలు, 13 కాంస్యాలను సాధించింది. -
ఆలిండియా పోలీస్ బాక్సింగ్‌లో రాష్ట్రానికి రెండు పథకాలు
హైదరాబాద్: 63వ ఆలిండియా పోలీస్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్ కాంస్య పథకాలు సాధించిన ట్లు తెలంగాణ అడిషినల్ డీజీపీ రాజీవ్ త్రివేది తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు ప్రకటించారు. సైబరాబాద్ క మిషనరేట్ పరిధిలో పనిచేసే రేష్మ సుల్తానా 75 కేజీల మహిళా బాక్సింగ్‌లో విభాగంలో కాంస్య పథకం సాధించారు. అంతేకాకుండా ఆమెతో పాటు 60 కేజీల విభాగంలో హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేసే సల్మాబేగం కాంస్యాన్ని గెలుచుకున్నారు. ఆలిండియా పోలీస్ బాక్సింగ్ పోటీల్లో రాష్ట్రానికి చెందిన మహిళలు పథకాలు సాధించడం ఇదే ప్రథమమని త్రివేది తెలిపారు. విజేతలకు రూ. లక్ష నగదును అందించనున్నట్లు సమాచారం.