ఇద్దరు దొంగల అరెస్టు ఆభరణాలు స్వాధీనం
హైదరాబాద్: మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ఇళ్లలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్థులను పోలీసులు గురువారం ఉదయం అరెస్టుచేశారు. వారి నుంచి 115 గ్రాముల బంగారు, 540 గ్రాముల వెండి, ఒక ద్విచక్రవాహనం, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కుమార్, రమేష్ అనే వ్యక్తులు తరుచుగా చోరీలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.