Two town police
-
పోలీసులు వేధింపులు : యువకులు ఆత్మహత్యాయత్నం
వైఎస్సార్ : ఎవరైన వేధిస్తే... సదరు బాధితులు పోలీసుల వద్దకు వెళ్లి తమ గోడు చెప్పుకంటారు. మరి అలాంటిది.. పోలీసులే వేధిస్తే.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇద్దరు యువకులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన కడప టూటౌన్‌పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక సాయిపేటకు చెందిన సురేష్ (27), శ్రీనివాస్ (28)లు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం సురేష్, శ్రీనివాస్‌ల ఇంటికి పోలీసులు వెళ్లి మీరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు... మా వద్ద పక్కా సమాచారం ఉందని బెదిరించారు. మీ మీద కేసు నమోదు చేయకుండా ఉండాలంటే మా ఉన్నతాధికారులతో బేరసారాలు చేయాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఇద్దరు యువకులు తమకు బెట్టింగ్‌కు ఎలాంటి సంబంధంలేదని మొరపెట్టుకున్నారు. దాంతో పోలీసులు వెళ్లి పోయారు. మళ్లీ సాయంత్రం వాళ్ల ఇంటి వద్దకు వచ్చి పోలీసులు ఇదే తీరుగా వ్యవహారించడంతో వారిద్దరు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో సదరు యువకులు ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. స్థానికులు వెంటనే స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసుల ఆగడాలపై స్థానికులు మండిపడుతున్నారు. -
ఈత సరదా ప్రాణం తీసింది
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: ఈత కొట్టాలనే సరదా ఓ యువకుడి ప్రాణాన్ని బలిగొంది. మహారాష్ట్రకు చెందిన మున్నాపటేల్(23) గోదావరినదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బాధితులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ మండలం ఇందారంలోని భారత్ జిన్నింగ్ మిల్లులో గోదావరిఖనికి చెందిన శ్యాంతోపాటు మహారాష్ట్రకు చెందిన బబ్బూల్‌పటేల్, సల్మాన్‌పటేల్, మున్నాపటేల్, విశాల్ ఖౌడే, ఆదిలాబాద్‌కు చెందిన సయ్యద్ ఆశ్రఫ్, సయ్యద్ అర్షద్, సయ్యద్ ఖలీం, కర్ణాటకకు చెందిన నాగరాజు పని చేస్తున్నారు. తోటి కార్మికుడు శ్యాం వివాహానికి హాజరయ్యేందుకు శనివారం హనుమాన్‌నగర్‌కు బైక్‌లపై బయలుదేరారు. వంతెన వద్ద గోదావరినదిలో స్నానం చేసేందుకు దిగారు. సయ్యద్ ఖలీం, సల్మాన్‌పటేల్, నాగరాజు మాత్రం తక్కువ లోతు ఉన్న ప్రాంతంలోనే ఉండిపోగా, సయ్యద్ అర్షద్, వి శాల్ ఖౌడే, బబ్బూల్‌పటేల్, సయ్యద్ ఆశ్రఫ్, మున్నాపటేల్ ఈత కొడుతూ మధ్యలోకి వెళ్లా రు. నది ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మున్నా గల్లంతయ్యాడు. మిగతా వారు నీటిలో మునిగిపోతుండడంతో భయంతో రక్షించాలం టూ కేకలు వేయగా సమీపంలో చేపలు పడుతు న్న మత్స్యకారులు వచ్చి వారిని ఒడ్డుకు చేర్చా రు. మున్నా మృతదేహం కోసం టూటౌన్ పో లీసులు, గజ ఈతగాళ్లు, సింగరేణి రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు ఆచూకీ లభించలేదు. వలస వచ్చిన సోదరులు.. మహారాష్ట్ర మోత్‌మావ్ జిల్లాలోని బిట్టర్‌గావ్‌కు చెందిన సోదరులు బబ్బూల్‌పటేల్, మున్నాపటేల్, సల్మాన్‌పటేల్ ఉపాధి కోసం ఆదిలాబాద్ జిల్లా ఇందారంలోని జిన్నింగ్ మిల్లులో ఏడాదిగా పనిచేస్తున్నారు. వీరి తల్లి ఏడాది క్రితం మరణించింది. మున్నాపటేల్ చనిపోయిన విషయాన్ని మహారాష్ట్రలోని వీరి పెద్దన్న అక్తరుల్లాపటేల్‌కు సమాచారమిచ్చారు. -
నగరంలో పట్టపగలు దొంగ హల్చల్
కాలనీలో పట్టపగలు ఓ దొంగ హల్చల్ చేశాడు. తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.11 వేల నగదు, 4 తులాల బంగారం అపహరించాడు. దాదాపు 2 గంటల సేపు ఇళ్లంతా కలియదిరిగాడు. బాధితులు, టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇవీ.. నగరంలో గార్మెంట్ దుకాణం నిర్వహిస్తున్న బాలనాగిరెడ్డి గురువారం మధ్యాహ్నం కిరాణా సరుకుల కోసం తన తల్లితో కలిసి పాతూరుకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగ ప్రహరీ గోడపై నుంచి కాంపౌండు లోపలకు దూకి, తలుపులకున్న తాళాన్ని బలమైన ఇనుపచువ్వలతో మెండి లోపలకు చొరబడ్డాడు. బీరువా తెరిచి అందులోని నగదు, బంగారు నగలు చోరీ చేశాడు. మరో బీరువా తలుపులు తీస్తుండగా, ఇంటి బయట గేటు తీసిన శబ్దం వినిపించింది. దీంతో ఆ దొంగ అప్రమత్తమై ఇంట్లోకి వస్తున్న యజమానిని తోసేసి పరారయ్యాడు. దంతో బిత్తరపోయిన బాలనాగిరెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బాధితుడి సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దొంగ వదిలేసి వెళ్లిన ఆయుధాలు, చేతి తొడుగులు, స్క్రూ డ్రైవర్, చేతిసంచిని స్వాధీనం చేసుకున్నారు. మరో బీరువాను తెరవక ముందే రావడంతో అందులో ఉన్న 8 తులాలు బంగారు నగలు, రూ.లక్ష నగదు చోరీ కాలేదు. దీంతో బాధితుడు ఊపిరి పీల్చుకున్నాడు. దొంగ ఆనవాళ్లను గుర్తించేందుకు కొన్ని ఫొటో ఆల్బమ్స్‌ను ఆయనకు చూపించారు. నలుగురు కానిస్టేబుళ్లు గాలింపు చేపట్టినట్లు సీఐ తెలిపారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. దొంగను త్వరలో పట్టుకుంటామని సీఐ మన్సూరుద్దీన్ తెలిపారు.