హెల్మెట్‌ను నిషేధించ కపోతే ఆమరణ దీక్ష
టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్
సుల్తాన్‌బజార్ : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నిబంధనను ప్రభుత్వం వెంటనే తొలగించాలని, లేకపోతే అక్టోబర్ 2 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని టూ వీలర్ రైడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అమానుల్లాఖాన్ అన్నారు. ఆదివారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...హెల్మెట్విషయంలో సిక్కులకు మినహాయింపు ఇచ్చినట్లుగా తెలంగాణలో ద్విచక్ర వాహనదారులకు కూడా మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం హెల్మెట్నిబంధనను తీసి వేస్తే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులనే ద్విచక్రవాహనదారులు గెలిపిస్తారన్నారు. హెల్మెట్ నిబంధన ఎత్తివేయకపోతే ఆమరణ దీక్ష చేపడతానని ెహచ్చరించారు. సమావేశంలో నాయకులు రవీం దర్, లక్షీ్ష్మనారాయణ, లక్కీ, సయ్యద్ పాల్గొన్నారు.