లారీ ఢీకొని ఇద్దరు మహిళలు మృతి
కర్నూలు జిల్లా డోన్ మండలం యు. కొత్తపల్లి జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న లారీ నలుగురు మహిళలను ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో గాయపడిన మహిళలను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
అయితే వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్కు తరలించారు. మృతి చెందిన ఇద్దరు మహిళ మృతదేహలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.