two years prison
-
లంచం అడిగిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు
మెదక్ మున్సిపాలిటీ : రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్ఓకు రెండేళ్ల జైలు, రూ. 6వేల జరిమానా విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు ఏసీబీ మెదక్ రేంజ్ డీఎస్పీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తూప్రాన్ మండలం గొల్లగడ్డ గ్రామం జీడిపల్లి పంచాయతీకి చెందిన పయ్యాల శంకర్‌కు అదే గ్రామ శివారులోని సర్వే నం. 128లో 2.15 ఎకరాల భూమి ఉంది. దాని మ్యూటేషన్ చేయించేందుకు తూప్రాన్ తహసీల్దార్ కార్యాలయంలో శంకర్ దరఖాస్తు చేసుకున్నాడు. పేరు మార్చాలంటే రూ.5వేలు లంచం ఇవ్వాలని వీఆర్ఓ వెంకట కిషన్‌రావు డిమాండ్ చేశాడు. దీంతో రైతు శంకర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు వలపన్ని రైతు శంకర్ నుంచి వీఆర్ఓ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటి నుంచి కేసు హైదరాబాద్ ఏసీబీ స్పెషల్ కోర్టులో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కోర్టులో కేసు విచారణకు రాగా వీఆర్ఓ వెంకట కిషన్‌రావుపై నేరం రుజువు కావడంతో అతడికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 6వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చినట్లు తెలిపారు. జరిమానా చెల్లించకుంటే మరో 3నెలల జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చినట్లు తెలిపారు. -
జానకీరామన్ కుమారుడికి రెండేళ్ల జైలు
టీనగర్: చెక్కు మోసం కేసులో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి జానకీరామన్ కుమారుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరు సమీపంలోగల పిరివిడయాంపట్టు గ్రామానికి చెందిన చిన్నప్ప. ఈయన పుదుచ్చేరి డీఎంకే మాజీ ముఖ్యమంత్రి జానకీరామన్ కుమారుడు చంద్రేష్కుమార్ను కలసి పుదుచ్చేరిలో స్థలాన్ని కొనుగోలుచేసి ఇవ్వాలని కోరారు. ఇందుకుగాను రూ.18 లక్షలు చంద్రేష్కుమార్కు చిన్నప్ప అందజేశారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో చిన్నప్ప తిరుక్కోవిలూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణకు చంద్రేష్కుమార్ కోర్టులో హాజరు కాలేదు. చెక్ మోసానికి పాల్పడిన చం ద్రేష్కుమార్కు రెండేళ్ల జైలు, రూ.5వేల అపరాధాన్ని విధిస్తూ మెజిస్ట్రేట్ షణ్ముగరాజ్ తీర్పునిచ్చారు. -
రూ. 12 లక్షలకు టోకరా.. రెండేళ్ల జైలు శిక్ష
తూర్పుగోదావరి(రావులపాలెం): చిట్టీల పేరుతో మోసం చేసి రూ.12లక్షలతో పరారైన కేసులో ఓ మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తపేట మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. 2009లో మండలంలోని వోగులంక గ్రామానికి చెందిన ప్యాతిలి గంగామణి అనే మహిళ ఆ గ్రామంలో చిట్టీల పేరుతో రూ. 12 లక్షలు వసూలు చేసి పరారు అయింది. దీంతో భాధితులు కోర్టుకెక్కారు. పోలీసులు నింధితురాలిని అదుపులోకి తీసుకున్ని కోర్టుకు రిమాండ్ చేశారు. అయితే కోర్టు మంగళవారం గంగామణికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేలు జరిమానా విధించింది.