టీనగర్: చెక్కు మోసం కేసులో పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి జానకీరామన్ కుమారుడికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరు సమీపంలోగల పిరివిడయాంపట్టు గ్రామానికి చెందిన చిన్నప్ప. ఈయన పుదుచ్చేరి డీఎంకే మాజీ ముఖ్యమంత్రి జానకీరామన్ కుమారుడు చంద్రేష్‌కుమార్‌ను కలసి పుదుచ్చేరిలో స్థలాన్ని కొనుగోలుచేసి ఇవ్వాలని కోరారు.
ఇందుకుగాను రూ.18 లక్షలు చంద్రేష్‌కుమార్‌కు చిన్నప్ప అందజేశారు. నగదు తిరిగి ఇవ్వకపోవడంతో చిన్నప్ప తిరుక్కోవిలూరు కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణకు చంద్రేష్‌కుమార్ కోర్టులో హాజరు కాలేదు. చెక్ మోసానికి పాల్పడిన చం ద్రేష్‌కుమార్‌కు రెండేళ్ల జైలు, రూ.5వేల అపరాధాన్ని విధిస్తూ మెజిస్ట్రేట్ షణ్ముగరాజ్ తీర్పునిచ్చారు.
జానకీరామన్ కుమారుడికి రెండేళ్ల జైలు
Published Sun, Apr 3 2016 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:05 PM
Advertisement
Advertisement