కుబేరుల ఖిల్లా... భారత్!
సింగపూర్/న్యూఢిల్లీ: అధిక బిలియనీర్లు ఉన్న ఆరో దేశంగా భారత్ ఈ ఏడాదీ తన స్థానాన్ని నిలుపుకుంది. అయితే 2013తో పోల్చితే బిలియనీర్ల సంఖ్య 103 నుంచి 100కు తగ్గింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సస్ 2014 ఈ వివరాలను వెల్లడించింది.
ముఖ్యాంశాలు...
ఈ ఏడాది భారత్‌లో కుబేరుల సంఖ్య 100కు తగ్గింది. ఈ వంద మంది సంపద కూడా 17, 500 కోట్ల డాలర్లకు చేరింది.
ఇక ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంఖ్య రికార్డ్ స్థాయికి, 2,325కు చేరింది.
స్విట్జర్లాండ్, హాంగ్‌కాంగ్, ఫ్రాన్స్ తదితర దేశాల కన్నా భారత్‌లోనే బిలియనీర్ల సంఖ్య అధికం.28 మంది బిలియనీర్లతో ముంబై ప్రపంచంలోనే అగ్రశ్రేణి 20 బిలియనీర్ సిటీస్‌లో ఒకటిగా నిలిచింది. ఈ షయంలో 103 మంది బిలియనీర్లతో న్యూయార్క్ అగ్రస్థానంలో ఉంది.
ఇక అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. 571 మంది బిలియనీర్లతో అమెరికా ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(190 మంది బిలియనీర్లు), యునై టెడ్ కింగ్డం(130)లు నిలిచాయి.