శేషాచలంలో టాస్క్‌ఫోర్స్ జల్లెడ
పులిబోను(భాకరాపేట), న్యూస్‌లైన్ : శేషాచల అడవుల్లో ‘ఎర్ర’ కూలీల కోసం వుువ్ముర గాలింపు చర్యలు చేపట్టినట్టు టాస్క్‌ఫోర్స్ వోఎస్డీ ఉదయ్‌కువూర్, ఏఆర్ డీఎస్పీ దేవదాసులు తెలిపారు. శనివారం శేషాచల అ టవీ ప్రాంతంలోని పులిబోను బేస్‌క్యాంపు వద్ద విలేకరులతో వారు వూట్లాడారు. వుూడు రోజు లుగా శేషాచల అడవుల్లో పోలీసులు, ఫారెస్టు శాఖ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి గాలిం పు చేపట్టావున్నారు. 50 ఎర్రచందనం దుం గలు, గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
శనివారం రాత్రి ఎర్రచందనం కూలీలు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి బేస్‌క్యాంప్‌లో ఉన్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారన్నారు. ఆ సమయంలో పోలీసులపై రాళ్లవర్షం కురిపించి కూలీలు చీకట్లో అటవీ ప్రాంతంలోకి జారుకున్నారని తెలిపారు. ‘ఎర్ర’ కూలీలు హద్దుమీరితే కాల్పులకూ వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు శేషాచల అడవుల్లో జల్లెడపడుతున్నట్టు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలోకి వచ్చే దారులన్నీ మూసివేశామన్నారు.
అనంతరం పులి బోను నుంచి కరివేపాకు కోనకు వెళ్లి ఎర్రచందనం దుంగలు నరికిన ప్రాంతాన్ని పరిశీలిం చారు. ప్రస్తుతం ఎర్రచందనం దుంగలను రెండు, మూడు అడుగుల పొడవు, చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి దుండగులు తరలిస్తున్నట్టు తెలిపారు. చంద్రగిరి, కొటాల, పనబాకం రైల్వేస్టేషన్ల నుంచి సంచుల్లో తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ గాలింపుల్లో భాకరాపేట ఎస్ఐ నెట్టికంఠయ్యు, ఏఆర్ ఎస్ఐ వుదు, భాకరాపేట పీఎస్ఐ రహీవుుల్లా, పోలీసులు, ఫారెస్టు అధికారులు కన్నయ్యు పాల్గొన్నారని వివరించారు.