uddanam kidney victims
-
కిడ్నీ రోగులను పరామర్శించిన మంత్రి విడదల రజిని
సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పర్యటించారు. కిడ్నీ రోగులను మంత్రి పరామర్శించారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి అన్నారు. కిడ్నీ రోగులకు మందులు అందిస్తున్నామని, సోంపేట, కంచిలి ఆసుపత్రుల్లో బెడ్లు పెంచుతామని విడదల రజిని వెల్లడించారు. ‘‘ఇప్పటికే మంచి వైద్యం అందిస్తున్నాం. ఇంకా ఏ మేరకు మెరుగైన సేవలు అందించాలని ఆలోచన చేస్తున్నాం. గ్రామాల్లో కిడ్నీ రోగనిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి అపోహలు లేకుండా ముందుకు రావాలి. కిడ్నీ రోగులకు ఇప్పటికే 172 రకాల మందులు ఇస్తున్నాం. ఇంకా ఏమైనా కావాలని డాక్టర్స్ సిఫార్స్ చేస్తే వాటినీ అందిస్తాం’’ అని మంత్రి తెలిపారు. చదవండి: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్ -
ఉద్దానంపై ప్రేమ కాదు.. ఉత్తరాంధ్రపై ఏడుపు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ, ఈనాడు రామోజీరావుకు ఉద్దానంపై ప్రేమ లేదని, విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందేమోనన్న ఏడుపు మాత్రమే వారిలో కనిపిస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. విశాఖ పరిపాలన రాజధాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు అన్యాయమంటూ ఈనాడు రాస్తున్నదంతా విష ప్రచారమేనని అన్నారు. అందులో భాగంగానే ఉద్దానంపైనా అసత్య కథనం రాశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దానంపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ఇక్కడ రక్షిత మంచినీటి ప్రాజెక్టు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారని, పలు చోట్ల డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారని చెప్పారు. కిడ్నీ వ్యాధి వ్యాపించకుండా చర్యలు చేపట్టారన్నారు. ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా, అసలక్కడ ఏ కార్యక్రమమూ జరగడంలేదన్నట్లుగా ప్రజలను నమ్మించేందుకు అబద్ధపు రాతలు రాస్తున్నారని అన్నారు. అసలు చంద్రబాబు హయాంలో ఉద్దానం ప్రజలను కబళిస్తున్న కిడ్నీ వ్యాధి నివారణకు ఏమి చర్యలు చేపట్టారో చెప్పాలని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం ఒక్కటైనా చేశారా? దీనికి రామోజీరావు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఉద్దానంపై వాస్తవాలు వక్రీకరించి అంతులేని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర ఈనాడు రామోజీరావు ఎంత ప్యాకేజీ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యానవనంలా ఉద్దానం ఘన చరిత్ర ఉన్న ఉద్దానం టీడీపీ ప్రభుత్వ హయాంలో అధ్వానంగా మారిందని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ఉద్దానంపై ప్రత్యేక దృష్టి పెట్టారని, కిడ్నీ జబ్బులు నయం చేయడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపోందించారని తెలిపారు. తుపాన్ వల్ల కుదేలైన ఉద్దానానికి ప్రత్యేక పరిహారం అందిచారన్నారు. అక్కడ పంపిణీ చేసిన జీడి, కొబ్బరి చెట్లతో ఉద్దానం ఉద్యానవనంగా మారుతోందని అన్నారు. వైఎస్ జగన్ 2017లో కవిటి సభలో చెప్పిన విధంగా తమ ప్రభుత్వం రాగానే అక్కడ రీసెర్చ్ సెంటర్, ప్రత్యేకంగా కిడ్నీ ఆస్పత్రి నిర్మాణం శరవేగంగా జరుగుతోందన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ఉద్దానం కోసం చేసిన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒక్కటీ లేవన్నారు. ఉద్దానంలో రీసెర్చ్ సంస్థ ఏర్పాటు చేస్తానని చెప్పిన చంద్రబాబు ఒక్క ఇటుక కూడా పేర్చలేదన్నారు. కేజీహెచ్ సెంటర్‌గా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పని చేస్తుందన్నారని, అదీ జరగలేదని చెప్పారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రత్యేకంగా స్పెషలైజ్డ్ నెఫ్రాలజీ యూనిట్ ఏర్పాటు చేశారని చెప్పారు. అందుకే చికిత్సలో, మందుల సరఫరాలో ఎక్కడా లోపం జరగడంలేదని చెప్పారు. అయినా, ప్రజలను పక్కదోవ పట్టించేలా కథనాలు ప్రచురిస్తున్న ఈనాడును, టీడీపీని ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి చెప్పారు. -
ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి / అరసవల్లి: రాష్ట్రంలో మూడేళ్ల క్రితం వరకు కిడ్నీ రోగుల పరిస్థితి ఏమిటని ఎవరైనా సరే స్వయంగా వెళ్లి బాధితులనే అడిగితే వాస్తవమేమిటో తెలుస్తుంది. కిడ్నీ బాధితుల కష్టాలను తన పాదయాత్రలో స్వయంగా చూసిన, విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి రాగానే విప్లవాత్మక చర్యలతో వారిని అన్ని విధాలా ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారు. ఓ వైపు వారికి అత్యాధునిక వైద్యం అందేలా చర్యలు తీసుకుంటూనే, మరో వైపు వారికి పింఛన్ పెంపు ద్వారా అర్థికంగా దన్నుగా నిలిచారు. ఇంకో వైపు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా మంచి నీటి సరఫరా జరిగేలా అడుగులు ముందుకు వేశారు. వాస్తవం ఇలా ఉంటే ఈనాడు పత్రిక అధినేత రామోజీరావుకు మాత్రం మరో కనిపిస్తోంది. మాటల్లో కాదు.. చేతల్లోనే ► 1980 దశకం నుంచి శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంత వరకు స్పష్టంగా నిర్ధారణ కానప్పటికీ.. అక్కడి తాగునీరే కారణం కావొచ్చేమోనన్న నిపుణుల అనుమానాల మేరకు 2019 సెప్టెంబరు 6వ తేదీన వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ ప్రాంతానికి శాశ్వత రక్షిత మంచి నీటి పథకాన్ని మంజూరు చేసింది. ► పలాస, ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రెండు మున్సిపాలిటీలతో పాటు 807 నివాసిత గ్రామాలకు ఉపయోగపడేలా ఈ పథకాన్ని రూపొందించింది. ఏడాది పొడవునా సురక్షిత నదీ జలాలను పైపులైన్ ద్వారా అందించేలా డిజైన్ చేశారు. ► ఉద్దానానికి సమీపంలో ఉండే బహుదా, మహేంద్ర తనయ నదుల నుంచి రక్షిత నీటి సరఫరాకు అవకాశం ఉన్నా, అవి వేసవిలో ఎండిపోతే ఇబ్బంది ఉంటుందని భావించి, దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న హిరమండలం రిజర్వాయర్ నుంచి భూ గర్భ పైపులైన్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా నీటిని తరలించి మెళియాపుట్టి మండల కేంద్రం వద్ద ఆ నీటిని ఇసుక ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేస్తారు. ► హిరమండలం రిజర్వాయర్‌లో ఏటా 19.5 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. అందులో 1.12 టీఎంసీల నీటిని ఉద్దానం ప్రాంత ప్రజల కోసం ప్రభుత్వం కేటాయించింది. శుద్ధి చేసిన నీటిని ఉద్దానం ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేస్తోన్న రక్షిత మంచి నీటి ఓవర్‌హెడ్ ట్యాంకులకు తరలిస్తారు. అక్కడి నుంచి ఆ ప్రాంతంలో ప్రతి ఇంటికి ఈ నీటిని అందిస్తారు. ఇప్పటికే 80 శాతం పనులను ప్రభుత్వం పూర్తి చేసింది. 2023 మార్చి నాటికి పనులు పూర్తవుతాయి. రోజుకు 84 మిలియన్ లీటర్ల తాగు నీటిని సరఫరా చేసేందుకు వీలుగా మెళియాపుట్టి ప్రాంతంలో నీటి ఫిల్టర్ బెడ్లు నిర్మిస్తున్నారు. కనీసం 30 ఏళ్ల పాటు సరఫరా చేసేలా వివిధ గ్రామాల్లో మొత్తం 571 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. ► 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ తర్వాత ఐదేళ్ల వరకు హడావుడి తప్ప చేసిందేమీ లేదు. పలాసలో 70శాతం పనులు పూర్తయిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైఎస్ జగన్ చర్యలు ఇలా.. ► ప్రతిపక్షనేత హోదాలో కవిటి మండలం జగతిలో కిడ్నీ బాధితుల భరోసా యాత్ర పేరిట వైఎస్ జగన్ పర్యటించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల పింఛన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సమస్యపై నిపుణులతో చర్చించారు. ► చంద్రబాబు ఇస్తున్న రూ.2,500 పింఛన్‌ను జగన్ అధికారంలోకి రాగానే వ్యాధి తీవ్రతను బట్టి రూ.10 వేలు, రూ.5 వేలు చేశారు. రూ.700 కోట్లతో భారీ రక్షిత మంచి నీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, 80 శాతానికి పైగా పూర్తి చేశారు. డయాలసిస్ కేంద్రాల్లో పడకల సంఖ్యను 62 నుంచి 90కి పెంచారు. ఇద్దరు నెఫ్రాలజిస్టులను నియమించారు. రూ.50 కోట్లతో పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రి నిర్మిస్తున్నారు. 70 శాతం పూర్తయింది. ► కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 37 రకాల మందులను నెఫ్రాలజిస్ట్‌లు సూచిస్తుంటారు. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంతంలోని పీహెచ్సీ నుంచి ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో 25 రకాల మందులను ఏపీఎంఎస్ఐడీసీ సరఫరా చేస్తోంది. మరో 12 రకాల మందులను స్థానిక అవసరాలకు అనుగుణంగా అక్కడికక్కడే కొనుగోలు చేసుకోవడానికి వైద్య శాఖ అనుమతులు ఇచ్చింది. ► వ్యాధి లక్షణాలు కన్పిస్తే వెంటనే సామాజిక ఆస్పత్రులకు వెళ్లి చికిత్స పొందే అవకాశం కల్పించారు. అక్కడ అవసరమైన మేరకు ఫిజీషియన్లను నియమించారు. డయాలసిస్ రోగులకు ఎత్రోపాయిటన్ ఇంజక్షన్ క్రమం తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారు. పలాస సీహెచ్‌సీలో నెఫ్రాలజిస్టును నియమించారు. వారానికి ఒకసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బతుకుతాననుకోలేదు.. నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ లక్షల రూపాయలు ప్రైవేటు ఆస్పత్రికే ధారబోశాను. అప్పట్లో కనీసం ఒక్క డాక్టర్ గానీ, మందులు ఇచ్చేవారు గానీ మా గ్రామానికి వచ్చేవారు కాదు. రెండున్నరేళ్ల నుంచి రూ.10 వేలు పింఛన్ వస్తోంది. నన్ను డయాలసిస్ కేంద్రానికి తీసుకువెళ్లడానికి 108 బండి వస్తోంది. నేను ఇప్పటి వరకు బతుకుతానని అసలు అనుకోలేదు. అంతా జగనన్న దయే. – సుగ్గు లక్ష్మీ, సన్యాసిపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా రూ.10 వేలు పింఛన్ అందుకుంటున్నాం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేలు పింఛను ఇస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డయాలసిస్ చేసుకోవడానికి స్థానికంగా బెడ్స్ లేక ఇబ్బంది పడేవాళ్లం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్థిక సమస్యలు నుంచి గట్టెక్కాం. డయాలసిస్ కూడా సకాలంలో చేసుకుంటున్నాం. – మర్రిపాటి తులసీదాస్, పెద్దశ్రీరాంపురం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా ఈనాడు కథనం అవాస్తవం శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంత మండలాల్లో కిడ్నీ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అద్భుత సేవలందుతున్నాయి. ఈ విషయాన్ని విస్మరించి ‘ఉద్దానాన్ని ఏం ఉద్ధరించారు..?’ అంటూ ఈనాడు తప్పుడు కథనం ప్రచురించడం దారుణం. జిల్లాలో 35 వేల మంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సికెడి) తో బాధపడుతున్నారని, ఇందులో 4,500 మంది చనిపోయారని రాశారు. డయాలసిస్ సెంటర్లు సరిపడా లేవని, నెఫ్రాలజిస్టులే లేరన్నారు. వాస్తవంగా జిల్లాలో 2,27,099 మందికి స్క్రీనింగ్ చేస్తే 19,379 మంది కిడ్నీ రోగులుగా తేలింది. ఇందులో 1,118 మంది వివిధ కారణాలతో చనిపోయారు. ఉద్దాన మండలాల్లోనే 28 డయాలసిస్ యూనిట్లను కొత్తగా ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఒకటి, హరిపురం సీహెచ్‌సీలో 10, పలాస సీహెచ్‌సీలో 04, సోంపేటలో 08, కవిటిలో 05 చొప్పున యూనిట్లు ఏర్పాటు చేశారు. ఇద్దరు నెప్రాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. పీహెచ్‌సీల్లోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 10 ఎనలైజర్లను కొనుగోలు చేశారు. అన్ని రకాల మందులు అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ మీనాక్షి, డీఎంహెచ్‌వో -
రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది...
రాజకీయం మారుతోందా..? అవుననే అనిపిస్తోంది. నాయకుడు మాటిస్తాడు, మర్చిపోతాడు అన్నదే జనాలకు తెలుసు. హామీ ఎన్నికల ఆయుధమన్నదే ప్రజల నమ్మిక. కానీ ఈ రాజకీయం వేరు. ఈ నాయకత్వం భిన్నం. ఈ పాలన వినూత్నం. కష్టం చెప్పుకున్న వారి చెంపలపై జారిన కన్నీళ్లు ఆయనకు ఇంకా గుర్తున్నాయి. చేతులు పట్టుకుని సాయం చేయమని కోరిన వారి మాటలు ఆయన చెవిలో ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వారి సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీలు ఇంకా ఆయన గుండెల్లోనే ఉన్నాయి. గెలిచి మూడు నెలలైంది. అప్పుడే ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారిపై యుద్ధం ప్రకటించారు. తిత్లీలో నష్టపోయి సాయం అందక, న్యాయం పొందక నిస్సహాయులుగా మిగిలిన వారిని ఆదుకుంటున్నారు. దశాబ్దాలుగా వేధిస్తున్న తాగునీటి సమస్య పరిష్కారానికి దారి చూపారు. రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సిక్కోలు ప్రజలు వేనోళ్ల కీర్తిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: దశాబ్దాల ఉద్దానం సమస్యకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చూపించారు. కిడ్నీ బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను నిలబెట్టుకున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేలు పింఛను అందజేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం తాజా గా మరో ముందడుగు వేసింది. కిడ్నీ బాధితుల కోసం పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, దానికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం యూనిట్‌కు రూ. 50 కోట్లు కేటాయిస్తూ జీఓ కూడా జారీ చేసింది. వాటికి అవసరమైన వైద్య పోస్టులను కూడా మంజూరు చేసింది. ఉద్దానంలో కిడ్నీవ్యాధిగ్రస్తుల బతుకులు, వెతలు మాటలకు అందనివి. ఈ పరిస్థితులను వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో దగ్గరుండి చూశారు. వెతలు చూసి చలించిపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల పింఛను, ఆ వ్యాధి మూలాలు తెలుసుకునేందుకు రీసెర్చ్ సెంటర్, రోగులకు దగ్గరలో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడిన కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ప్రభుత్వాలు మా రినా ఇక్కడి పరిస్థితులు ఏ మాత్రం మారలేదు. టీడీపీ పాలనలోనైతే పరిస్థితి మరింత దయనీయంగా ఉండేది. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీలో పథకం వైద్యం అందించే అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వ్యాధుల కత్తిరింపుల నేపథ్యంలో కి డ్నీ వ్యాధిగ్రస్తులకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలో అరకొర సాయం.. జిల్లాలో ఇచ్ఛాపురం, కంచిలి, కవిటి, వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట మండలాల్లో 16వేలకు పైగా కిడ్నీ రోగులు ఉన్నారు. అందులో మందస మండలం ఒక్క లోహరిబందలోనే 1500మందికి పైగా కిడ్నీ రోగులు ఉన్నా రు. గత ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు 370మందికి రూ. 2500 పింఛ ను ఇస్తూ ఉండేది. ఎన్నికలకు రెండు నెలలు ఉండగా దాన్ని రూ. 3500కు పెంచింది. అదనంగా మరో 220 మందికి లబ్ధి చేకూర్చింది. కానీ ఈ డబ్బు బాధితులకు ఎంత మాత్రమూ సరిపోయేది కాదు. పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల్లో ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నానంటూ కిడ్నీ రోగులకు భరోసా ఇచ్చారు. ప్రతి కిడ్నీ రోగికి అధికారంలోకి రాగానే రూ. 10వేలు పింఛ ను ఇస్తానని, దగ్గరలోనే డయాలసిస్ యూనిట్‌తో పాటు కిడ్నీ రీసె ర్ఛ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుం డా కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉన్నందున 200 పడకలతో ఆస్పత్రి కూడా నెలకొల్పుతానని, అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేసి పనులు చేపడుతానని హామీ ఇచ్చారు. అక్కడితో ఆగకుండా తాగునీరు కలుషితమైనందున ప్రతి గ్రామానికి శుద్ధ జలాలను అందిస్తామని ధైర్యం కలిగించారు. మాట మర్చిపోకుండా.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కి డ్నీ వ్యాధిగ్రస్తులనే ప్రాధాన్యత అంశంగా తీసుకున్నారు. నెలవారీ ఇచ్చే పింఛనును రూ. 10వేలకు పెంచారు. వెంటనే అమల్లోకి తెచ్చి బాధితులకు అందజేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రిలో డ యాలసిస్ చేసుకుంటున్న 507మందికి, ప్రైవే టు ఆస్పత్రిలో డయాలసిస్ చేసుకుంటున్న 219 మందికి నెలకి రూ. 10వేలు చొప్పున మొత్తం 726 మందికి అందజేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలో డయాలసిస్ రోగుల కోసం పింఛ ను కింద రూ. 20లక్షలు వెచ్చించగా, అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వం పింఛన్ల కింద నెలకి రూ. 72లక్షల 60వేలు ఖర్చు పెడుతోంది. అంతటితో ఆగని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యులు, నిపుణులు, మేధావులు, అధికారులతో సుదీర్ఘ అధ్యయనం చేసి బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లోనే ఒక పరిష్కార మార్గాన్ని అన్వేషించారు. వ్యాధిని అదుపులోకి తీసుకురావాలంటే మూలాలు తెలుసుకోవాలని, దాని కోసం ఏకంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే, దగ్గరలో డయాలసిస్ సెంటర్‌తో పాటు 200 పడకల సూపర్ స్పెషాలటీ ఆస్పత్రిని కూడా నెలకొల్పాలని నిర్ణయించారు. ప్రకటన చేయడమే కాకుండా దానికి సంబంధించిన జీఓ కూడా విడుదల చేశారు. దానితో పాటే రూ. 50కోట్ల నిధులు, వైద్యపోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టులివి.. రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో ప్రభుత్వ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. రెగ్యులర్ ప్రాతిపదికన ఐదు పోస్టులు, కాంట్రాక్ట్ పద్దతి కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద 60పోస్టులను మంజూరు చేసింది. రెగ్యులర్ పోస్టులు.. అడిషనల్ డైరెక్టర్ హోదాలో మెడికల్ సూపరింటెండెంట్, సీఎస్ఆర్ఎంఓ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను రెగ్యులర్ హోదాలో భర్తీ చేయనుంది. కాంట్రాక్ట్ పోసులు.. యూరాలిజిస్టు పోస్టులు రెండు, వాస్క్యూలర్ సర్జన్ పోస్టు ఒకటి, జనరల్ ఫిజీషియన్ పోస్టులు నాలుగు, జనరల్ సర్జన్ పోస్టులు రెండు, అనస్తీటిస్టు పోస్టులు నాలుగు, రేడియోలజిస్టు పోస్టు ఒకటి, పెథాలజిస్టు పోస్టు ఒకటి, మైక్రో బయాలజిస్టు పోస్టు ఒకటి, బయో కెమిస్టు పోస్టు ఒకటి, జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 12, నూట్రీషనిస్టు పోస్టు ఒకటి, 60 స్టాఫ్ నర్సు పోస్టులు, ఇద్దరు రీసెర్చ్ ల్యాబ్ ప్రాజెక్టు మేనేజర్ పోస్టులు, రీసెర్చ్ సైంటిస్టు పోస్టులు రెండు, సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు రెండు, జూనియర్ రీసెర్స్ ఫెలో పోస్టులు–2ను కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు. మిగతా 60 పోస్టులను ఔట్ సోర్స్ పద్ధతిలో నియమించనున్నారు. మరో అడుగు ముందుకు.. ఉద్దానంలో కిడ్నీ సమస్యను అధిగమించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ముందడుగు వేశారు. వ్యాధుల విజృంభణకు ప్రాథమిక కారణంగా చెబుతున్న మంచినీటి సమస్యను పరి ష్కరించాలని నిర్ణయించారు. ఉద్దానంలోని ఇ చ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, వజ్రపుకొత్తూరు, పలాస మండలాల్లోని 807 గ్రామాలకు శుద్ధ జలాలను అందించేందుకు రూ. 600కోట్లతో భారీ మంచినీటి పథకాన్ని నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. తొమ్మిది క్లస్టర్లలో నీటిసరఫరాకు ప్రణాళిక రూపొందించారు. సమస్యలు తీరుతాయి.. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో కిడ్నీవ్యాధి బారిన పడిన వారు విశాఖ, శ్రీకాకుళం వెళ్లి వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ ఖర్చులు, మందుల ఖర్చులతో ఆర్థికంగా చితికిపోతున్నాం. ప్రస్తు తం ప్రభుత్వం రూ.పది వేల పింఛన్ అందజేస్తుండడంతో మాలాంటి వారికి ఎంతో ఆసరా కలిగింది. పలాసలో కిడ్నీ రోగుల కోసం ఆస్పత్రి నిర్మిస్తే మా వంటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంత ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. – బైరి కూర్మారావు, బెంకిలి, డయాలసిస్ రోగి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.. దశాబ్దాల పాటు ఉద్దానం ప్రాంతాన్ని పీడిస్తున్న కిడ్నీ వ్యాధి బారిన పడి వందలాది మంది ఉద్దానం వాసులు కాటికెళ్లారు. ప్రభుత్వాలు మారాయి కానీ ఈ ప్రాంత రోగుల గురించి ప ట్టించుకునే నాథుడే లేకపోయారు. కానీ నాడు జగతిలో జరిగిన సమావేశంలో మావంటి రోగుల పక్షాన నిలిచి, ఇచ్చిన మాటకు కట్టుబడిన ఏకైక రాజకీయ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఆయన ఇప్పుడు మా కోసం తీసుకున్న నిర్ణయం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుంది. – చంద్రు మజ్జి, కిడ్నీ వ్యాధిగ్రస్తుడు, తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం -
కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
ఉద్ధానం సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్‌కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో ప్రభుత్వం సిబ్బందిని నియమించనుంది. వైద్యుడు, సిబ్బందిని మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ప్రాతిపదికన 5 పోస్టులు, కాంట్రాక్ బేసిస్ కింద 98, సర్వీస్ ఔట్‌సోర్స్ కింద60 పోస్టులను మంజూరు చేసింది. కాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి కాకముందే తమ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కిడ్నీ బాధితులకు ‘భరోసా’గా రూ.10 వేలు కాగా, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచే కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పెన్షన్ ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం ప్రాంతంతో పర్యటించారు. కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లిస్తున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. అంతే కాకుండా ఉద్దాన సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ఇపుడు రూ.50 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న ఉద్దాన సమస్యపై సీఎం జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం కిడ్నీ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారని ప్రశంసిస్తున్నారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
కిడ్నీ బాధితులకు ‘భరోసా’
సాక్షి, అమరావతి/శ్రీకాకుళం (పాత బస్టాండ్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చేపట్టిన సుదీర్ఘ ప్రజాసంకల్ప యాత్ర చివరి దశకు చేరుకున్న రోజులవి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల అవస్థలను చూసి ఆయన చలించిపోయారు. వారి గోడు విన్న వైఎస్ జగన్ ‘మనం అధికారంలోకి వస్తే నెలకు రూ.10 వేల ఇస్తా’నని మాట ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే వృద్ధాప్య, వితంతు పెన్షన్లతోపాటు కిడ్నీ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం వారికిచ్చే పింఛను రూ.10 వేలకు పెంచారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేసే నాటికి కిడ్నీ బాధితులకు ప్రభుత్వం నెలకు రూ.2,500 ఇచ్చేది. ఆయన పాదయాత్ర అనంతరం మరో వెయ్యి పెంచి ఎన్నికల ముందు నుంచి రూ.3,500 చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల బాధను మరచిపోయేలా చేశాయని వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేలాది కుటుంబాలకు ఆసరాగా.. రాష్ట్రంలో సుమారు 8,500 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరిలో ఎక్కువ మంది శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలోని 112 గ్రామాల్లో ఉన్నారు. ఆ తర్వాత కృష్ణా జిల్లా జి.కొండూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో డయాలసిస్ బాధితులు ఉన్నారు. వీళ్లందరూ పేదవాళ్లే. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో 4 వేల మందికి మాత్రమే నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇచ్చేవారు. 2019 ఫిబ్రవరి తరువాత 8,500 మందికి రూ.3,500 చొప్పున రూ.2.80 కోట్లను వ్యయం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1నుంచి రూ.10 వేల చొప్పున 8,500 మందికి నెలకు రూ.8.50 కోట్లను చెల్లించనున్నారు. కేవలం కిడ్నీ బాధితులకు ఇచ్చే పింఛను వ్యయమే ఏడాదికి రూ.102 కోట్లు కానుంది. మా పాలిట దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మా పాలిట దేవుడయ్యారు. కిడ్నీ డయాలసిస్ రోగులకు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. ఇప్పటివరకు అప్పుల ఊబిలో మునిగిపోయిన మాకు పింఛను నెలకు రూ.10 ఇవ్వనుండటంతో ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది. – కొరికాన లక్ష్మీకాంతం, పెద్ద శ్రీరాంపురం, కంచిలి మండలం -
వైఎస్ జగన్‌ను కలిసిన ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులు
-
కిడ్నీ బాధితుల కోసం పవన్ 24 గంటల దీక్ష
ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలపై తాను చేసిన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ 24 గంటల దీక్షకు దిగారు. ఎచ్చెర్ల మండలంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు దీక్ష ప్రారంభించారు. శనివారం సాయంత్రం వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కాగా, శనివారం నాటి దీక్ష శ్రీకాకుళం పట్టణంలో ఉ.9గంటలకు ప్రజల సమక్షంలో కొనసాగిస్తారని జనసేన మీడియా ఇన్చార్జి హరిప్రసాద్ మీడియాకు చెప్పారు. కిడ్నీ బాధితుల సమస్యలపై పవన్ కల్యాణ్ 17 డిమాండ్లతో కూడిన ప్రకటన విడుదల చేశారని.. ఇందులో భాగంగా ఆరోగ్య ఎమర్జెన్సీ విధించాలని, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి నేరుగా దీనిని పర్యవేక్షించాలనే ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వ స్పందన లేదన్నారు. కిడ్నీ వ్యాధితో జిల్లాలో రోజుకు ఒకరు మృత్యువాత పడుతున్నా సర్కార్ పట్టించుకోవడంలేదని హరిప్రసాద్ ఆరోపిం చారు. సాంకేతికంగా ప్రగతి సాధించిన ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రధాన సమస్యగా మారిందన్నారు. కాగా, శనివారం సాయంత్రం పవన్‌కల్యాణ్ దీక్ష ముగిసిన తరువాత ప్రజాపోరాట యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు. -
ఏపీ, తెలంగాణ సుభిక్షంగా ఉండాలి: పవన్
హైదరాబాద్: సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగు నింపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని సినీనటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. కరెన్సీ నోట్ల రద్దు వంటి గాయాలు మళ్లీ చేయకుండా రాజకీయ పెద్దల నుంచి ప్రజలను కాపాడాలని ఆకాంక్షించారు. ఈ సంక్రాంతికి ఉద్దానం కిడ్నీ బాధితులకు స్వాంతన కలగించాలని ప్రార్థించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.