సాక్షి, శ్రీకాకుళం: ఉద్దానంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పర్యటించారు. కిడ్నీ రోగులను మంత్రి పరామర్శించారు. కిడ్నీ వ్యాధి నిర్మూలనపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి అన్నారు. కిడ్నీ రోగులకు మందులు అందిస్తున్నామని, సోంపేట, కంచిలి ఆసుపత్రుల్లో బెడ్‌లు పెంచుతామని విడదల రజిని వెల్లడించారు.
‘‘ఇప్పటికే మంచి వైద్యం అందిస్తున్నాం. ఇంకా ఏ మేరకు మెరుగైన సేవలు అందించాలని ఆలోచన చేస్తున్నాం. గ్రామాల్లో కిడ్నీ రోగనిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి అపోహలు లేకుండా ముందుకు రావాలి. కిడ్నీ రోగులకు ఇప్పటికే 172 రకాల మందులు ఇస్తున్నాం. ఇంకా ఏమైనా కావాలని డాక్టర్స్ సిఫార్స్ చేస్తే వాటినీ అందిస్తాం’’ అని మంత్రి తెలిపారు.
చదవండి: టీడీపీ మహిళా కార్యకర్తల ఓవరాక్షన్
Comments
Please login to add a commentAdd a comment