మేనిఫెస్టోలో సంచలన అంశం.. వింత వివరణ
లండన్: బ్రిటన్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు బరిలోకి దిగిన యూకే ఇండిపెండెన్స్ పార్టీ (యూకేఐపీ) ఒక కొత్త హామీని తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. తాము అధికారంలోకి వస్తే ముస్లిం మహిళలకు మరింత స్వేచ్ఛను ఇస్తామని, వారు ముసుగు ధరించడాన్ని రద్దు చేస్తామని తెలిపింది. ఇందుకు కారణంగా మాత్రం ఎవరూ ఊహించని విషయాన్ని తెలిపింది.
ముసుగు వల్ల ముస్లిం మహిళలకు డీ విటమిన్ అందడం లేదని అందుకే దానిని రద్దు చేస్తామని తెలిపింది. ‘బురఖా ధరించడం వల్ల గుర్తింపును దాచినట్లవుతుంది. కమ్యునికేషన్‌కు ఇబ్బందవుతుంది. ఉద్యోగ అవకాశాలు తక్కువవుతాయి. గృహహింసకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అంతేకాకుండా శరీరానికి ఎంతో ముఖ్యమైన డీ విటమిన్ అందకుండా పోతుంది’ అంటూ పలు కారణాలు వివరిస్తూ మేనిఫెస్టోలో ముసుగు రద్దు అంశాన్ని యూకేఐపీ చేర్చింది.