క్వార్టర్స్‌లో బాక్సర్ హుస్సాముద్దీన్
న్యూఢిల్లీ: ఉలాన్బాటర్ కప్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
మంగోలియాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 56 కేజీల విభాగం తొలి రౌండ్లో అలీబెకోవ్ (కిర్గిస్తాన్)పై హుస్సాముద్దీన్ గెలిచాడు. 49 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్‌కు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు బై లభించింది.