‘మతపరమైన నిర్మాణాల’ పిటిషన్‌కు ఓకే
న్యూఢిల్లీ: మతపరమైన నిర్మాణాల కోసం ప్రభుత్వాలు ఉచితంగా స్థలాన్ని కేటాయించే విషయంపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. 1986లో చెన్నై సమీపంలోని ఉల్లగరం అనే గ్రామంలో మసీదు నిర్మాణం కోసం తమిళనాడు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
దీనిని సవాలు చేస్తూ చెన్నై సబర్బన్ సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది