మందులులేని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం
కల్లూరు (కర్నూలు జిల్లా): ఆ ప్రాథమిక కేంద్రంలో మందులులేక రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత 20 రోజులగా మందులు లేని ఈ ప్రాథమిక కేంద్రం కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉల్లిందకొండ గ్రామంలో ఉంది. 20 రోజులుగా ఆస్పత్రిలో మందులు లేకపోవడం విశేషం. మందుల కోసం వచ్చిన రోగులకు ఆస్పత్రి వర్గాలు మొండి చెయ్యే చూపుతున్నాయి. 20 రోజులుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందులు లేకున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు.