Uma Maheswar
-
బ్యాంకుకి టోపీ పెట్టిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఫ్యామిలీ
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు నిర్వాకం బయటపడింది. తపస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఉమామహేశ్వరరావు సోదరులు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని చెల్లించలేదు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఉమామహేశ్వరరావు పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలానికి ఫ్లెక్సీలు అతికించారు. చదవండి: (చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి) -
టీడీపీ ఇన్చార్జి మోసం.. మహిళ ధర్నా
కళ్యాణదుర్గం: గత ఎన్నికల్లో టీడీపీ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓటమిపాలై పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఉమామహేశ్వరనాయుడు, ఆయన సోదరుడు ఇంద్రసేనాచౌదరిల మోసాల బాగోతాన్ని మరోసారి ఓ మహిళ బయటపెట్టింది. ఇందులో భాగంగానే గురువారం టీడీపీ కార్యాలయం వద్ద బాధితురాలు లక్ష్మీ స్థానిక మహిళలతో కలిసి ధర్నాకు దిగింది. అంతకు ముందు ఉమామహేశ్వరనాయుడు సొంత కార్యాలయం వద్ద ధర్నా చేయాలని వెళ్లగా ఆయన లేకపోవడంతో పార్టీ కార్యాలయం వద్ద బైఠాయించింది. బిల్లులు ఇవ్వకపోవడంతో శివాజీ ఆత్మహత్య ఉమామహేశ్వరనాయుడు, తమ్ముడు ఇంద్రసేనా చౌదరిల వద్ద బాధిత మహిళ లక్ష్మీ భర్త శివాజీ సబ్‌కాంట్రాక్టర్‌గా పనిచేశాడు. రెండేళ్ల క్రితం ఉరవకొండ ప్రాంతంలోని హెచ్ఎల్సీ కాలువ పనులకు సంబంధించి రూ.2 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేశారు. ఇంద్రసేనా చౌదరి పేరుతో వచ్చిన పనులను శివాజీ సబ్ కాంట్రాక్ట్‌తో పూర్తి చేశాడు. ఇందు కోసం ఆయన అప్పులు చేశారు. రావాల్సిన బిల్లులు రూ. 2 కోట్లు ఇవ్వకుండా అడపాదడపా రూ. 36 లక్షలు చెల్లించారు. పన్నులు పోను మిగిలిన రూ. 1.45 కోట్లు బిల్లులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్పుల భారం భరించలేని లక్ష్మీ భర్త శివాజీ ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడినీ చంపుతామని బెదిరింపు బిల్లుల కోసం ఎన్నోసార్లు ప్రాధేయపడినా ఇవ్వకుండా బెదిరించడం, చంపుతామని హెచ్చరించడం చేస్తున్నట్లు బాధితురాలు లక్ష్మీ తెలిపారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు దగ్గరకు ఐదుసార్లు వెళ్లివచ్చినట్లు బాధితురాలు తెలిపారు. చంద్రబాబు ఫోన్లో ఉమాకు డబ్బులు ఇవ్వాలని చెప్పినా ఫలితం లేకపోయింది. ఫోన్లు చేసి బిల్లు విషయమై నిలదీస్తే నీ కుమారుడు చైతన్యవర్మను కూడా చంపుతామని ఉమామహేశ్వరనాయుడు, ఆయన సోదరుడు ఇంద్రసేనా చౌదరిలు బెదిరిస్తున్నట్లు ఆమె తెలిపారు. తనతో పాటు తన కుమారుడి చావుకు ఉమా సోదరులే కారకులవుతారని తాను, తన కుమారుడు ఆత్మహత్య చేసుకుంటామని మీడియా వద్ద బాధిత మహిళ వాపోయింది. మహిళలతో కలిసి టీడీపీ కార్యాలయం వద్ద బాధిత మహిళ ధర్నా చేస్తుండగా ప్రజా సంఘాల నాయకులు శివశంకరనాయక్, నాగరాజు తదితరులు మద్దతు పలికారు. ఉమా వర్గానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు నాగరాజు కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేస్తున్న మహిళలను బెదిరించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. న్యాయం జరిగే వరకు పోరాడతానని లక్ష్మీ స్పష్టం చేశారు. -
ఐదుసార్లు ఫెయిల్
ఉమ జీవితంలోని వరుస అపజయాలు ఆమెను దృఢపరచి, ఆత్మవిశ్వాసంతో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పూర్తి చేసేందుకు ఉపయోగపడ్డాయి. గత ఏడాది చేసిన ఆరో ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించిన ఉమకు స్ఫూర్తిని ఇచ్చినవారు స్టీవ్ జాబ్స్ సహా ఎందరో ఉన్నారు. ‘‘నా బాల్యమంతా తమిళనాడులోని తిరునల్వేలిలో జరిగింది. ఇంజనీరింగ్ పూర్తి చేశాక, ఎంబిఏ చదవాలనుకున్నాను. సిఎస్ఈ చదువుతానని ఏ రోజూ అనుకోలేదు. మా ప్రొఫెసర్ అబూబకర్ ప్రోత్సాహం మీద 2011 లో మొదటిసారి పరీక్ష రాశాను. తగినంత కృషి చేయకపోవడం వల్లనో ఏమో ఫెయిల్ అయ్యాను’ అంటారు ఉమ. ఒకేసారి మూడు ఉద్యోగాలు! చదువు పూర్తి అవుతుండగానే, మూడు పెద్ద కార్పొరేట్ కంపెనీల నుంచి ఒకేసారి మూడు ఆఫర్ లెటర్స్ అందుకున్నారు ఉమ. ఒకదాన్ని ఎంచుకుని అందులో చేరారు. ‘‘నాన్న గతించేవరకు నా జీవితం పూలబాటలో నడిచింది. కొన్ని రోజులకే అమ్మ కూడా పోవడంతో, భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించింది’ అని గుర్తుచేసుకుంటారు ఉమా మహేశ్వరి. కార్పొరేట్ సంస్థలలో ఆమె ఐదు సంవత్సరాలు పని చేశారు. అలా పని చేస్తూనే, సివిల్ సర్వీస్‌కి ప్రిపేర్ అయ్యారు. ఐదుసార్లు రాసినప్పటికీ విజయం సాధించలేకపోయారు! సాధారణంగా ఇన్నిసార్లు ఓటమి చెందితే మళ్లీ రాయరు. చుట్టూ ఉన్నవారంతా ‘ఇంకేం చదువుతావులే మానేయ్’ అని హేళన చేసినా, ఉమలో తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదల పెరిగింది. 2017లో ఉద్యోగాన్ని వదిలి, పరీక్ష కోసం దీక్షగా కూర్చొని ప్రిపేర్ అయ్యారు. చదువుతుండగానే తెల్లారేది అప్పటికే పెళ్లయింది ఉమకు. ఇంటిని చక్కబెట్టుకుంటూ, పిల్లలను చూసుకుంటూ, చదువుకోవటానికి కొంత సమయం కేటాయించారు. ‘‘ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు చదువు, ఆ తరవాత ఇంటి పనులు, అమ్మాయిని స్కూల్‌కి రెడీ చేయడం, మధ్యాహ్నం భోజన సమయం వరకు మళ్లీ చదువుకుని, సాయంత్రం మా అమ్మాయి ఇంటికి వచ్చాక తనతో గడపడం, తరవాత మళ్లీ చదువుకోవడం.. ఇదీ నా షెడ్యూల్. మెయిన్స్‌కి మాత్రం తెల్లవారుజామున మూడు గంటల వరకు చదివాను’’ అని తెలిపారు ఉమా మహేశ్వరి.ఇంటిని, పిల్లలను చూసుకుంటూనే సిఎస్ఈలో రెండోస్థానం సాధించిన అనూ కుమారి కూడా ఉమకు ఒక ఇన్స్పిరేషన్. హర్యానాకు చెందిన అనూ కుమారి సాధించిన విజయాలు, ఉమ అత్తమామలకు, భర్తకు కూడా ఉమ మీద నమ్మకాన్ని పెంచాయి. పట్టుదల ఉంటే బిడ్డ తల్లికి కూడా అన్నీ సాధ్యమే అని అర్థం చేసుకున్నారు. చివరి ప్రయత్నంలో 2018లో ఉమ సివిల్స్‌లో విజయం సాధించారు. ఈ ఏడాది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఇప్పుడు తన పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. ‘‘నీ మీద నీకు ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకు, ఆ నమ్మకమే నిన్ను విజయం వైపుగా నడిపిస్తుంది’’ అన్న స్టీవ్ జాబ్స్ మాటలు తన విజయానికి బాటలు వేశాయి అంటారు ఉమా మహేశ్వరి. – వైజయంతి -
పార్టీ ఆఫీస్ నిర్మాణమూ అక్రమమే
-
ఇక్కడ టీడీపీ డమ్మీ..!
సాక్షి, కల్యాణదుర్గం : కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 13 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీడీపీ ఐదుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ, జేఎన్పీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ దఫా కల్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటమే. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. చీకటి ఒప్పందంతో బరిలోకి ‘డమ్మీ’ ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కనీసం పీసీసీ చీఫ్‌ను గెలిపించాలని చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే.. మిగిలిన చోట్ల తాము సహకరిస్తామన్నారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పెద్దగా ఎవరికీ తెలియని తృతీయ శ్రేణి నేత ఉమామహేశ్వర్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ‘ఫ్యాన్’ హోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఏటికి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం కావడంతో ఈ రెండు పార్టీలను ప్రజలు దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామాలు మరింత కలిసొచ్చే అంశం. ఆరోపణలు, విభేదాలతో టీడీపీ సతమతం కల్యాణదుర్గం నుంచి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 22,318 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గెలుపునకు ఈ మెజార్టీ దోహదపడింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిన స్థానం ఇదే. ఈ ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్ రాకుండా జేసీ దివాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. దీనికితోడు చౌదరి కుటుంబం అవినీతి విషయంలో రెచ్చిపోయింది. విండ్ పవర్ భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడింది. రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే భూములు కొనుగోలు చేసి.. అవే భూములను విండ్ పవర్ సంస్థకు రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు విక్రయించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల భూములను విండ్ పవర్ కోసం కంపెనీలు కొనుగోలు చేశాయి. రైల్వే కాంట్రాక్టుల్లో కూడా ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. నియోజకవర్గంలో జరిగిన పనులు, ఇతర కాంట్రాక్టుల్లో ఆ కుటుంబ సభ్యులు చేతులు పెట్టారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. దీనికి తోడు స్థానిక నేతలైన రామ్మోహన్ చౌదరి, నారాయణ, రమేశ్, మల్లికార్జున వంటి నాయకులు చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారు. స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకోమని ఫోన్లో సూచించారు. ఆ రెండు పార్టీలకూ ముప్పే రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిర. పునర్విభజనలో భాగంగా 2009లో మడకశిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో పెనుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి కల్యాణ దుర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ సహకారం లభిస్తుందని ఆశించినా.. మూడు దశాబ్దాల పాటు సైకిల్ గుర్తుకు ఓటేసిన ప్రజలు ఒక్కసారి హస్తానికి వేయాలంటే కుదరని పని. దీంతో టీడీపీ ఓట్లు రఘువీరా, ఉమామహేశ్వరావు చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరి కూడా టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీడీపీలో విభేదాలు.. వైఎస్సార్సీపీలో ఐక్యతా రాగం టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని వ్యతిరేకించిన వారంతా ఉమామహేశ్వరరావుకు కూడా సహకారం అందించడం లేదు. స్థానికులకు సీటివ్వాలని తాము కోరితే స్థానికేతరులకు ఇచ్చారన్న అక్కసుతో పార్టీ శ్రేణులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిమి పాలైన తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డితోపాటు నేతలంతా ఉషాశ్రీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇది వైఎస్సార్ సీపీకి లాభించే అంశం. మరోవైపు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా గెలవాలనే తాపత్రయంతో బరిలో ఉన్న పీసీపీ చీఫ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,10,622 పురుషులు : 1,06,341 మహిళలు : 1,04,275 ఇతరులు: 06 – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం -
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి
మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై డివైడర్‌ను బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో మొయినాబాద్ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్(35) మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.