umpiring career
-
19 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలికిన దిగ్గజ అంపైర్
దిగ్గజ అంపైర్ అలీమ్ దార్ తన 19 ఏళ్ల అంపైరింగ్ కెరీర్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌కు చెందిన 54 ఏళ్ల అలీమ్ దార్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌గా విధులు నిర్వర్తించారు. దిగ్గజ అంపైర్‌గా పేరు పొందిన ఆయన రికార్డు స్థాయిలో 435 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేశారు. ఇందులో 2007, 2011 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్స్‌తో పాటు 2010, 2012 టి20 వరల్డ్‌కప్ ఫైనల్స్ కూడా ఉన్నాయి. 2000లో అంపైర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అలీమ్‌దార్ పాకిస్తాన్ నుంచి ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న వ్యక్తిగా నిలిచిపోయారు. మొత్తంగా 435 మ్యాచ్‌ల్లో 222 వన్డేలు, 144 టెస్టులు, 69 టి20 మ్యాచ్‌ల్లో అంపైరింగ్ నిర్వహించారు. ఇక ఐదు వన్డే వరల్డ్‌కప్, ఏడు టి20 వరల్డ్‌కప్స్‌కు అంపైర్‌గా పనిచేశారు. 2009, 2010, 2011లో వరుసగా మూడుసార్లు డేవిడ్ షెపర్డ్ ట్రోఫీ(ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్)ని గెలుచుకోవడం విశేషం. అంపైరింగ్ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై అలీమ్ దార్ స్పందిస్తూ.. ''అంపైర్‌గా లాంగ్ జర్నీని బాగా ఎంజాయ్ చేశాడు. ఒక అంపైర్‌గా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి పేరు తెచ్చుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అంపైరింగ్ కెరీర్‌ను ప్రారంభించిన కొత్తలో ఈ స్థాయికి చేరుకుంటానని కలలో కూడా ఊహించలేదు. మూడుసార్లు ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకోవడం నా కెరీర్లోనే పెద్ద అచీవ్మెంట్. 19 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం అని భావిస్తున్నా. ఇప్పుడున్న అంపైర్లకు నా సలహా ఏంటంటే.. కష్టపడండి, మర్యాదగా నడుచుకోండి..కొత్త విషయాలను నేర్చుకోవడం ఎప్పటికి ఆపకండి'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఐసీసీ తమ ఎలైట్ ప్యానెల్ అంపైరింగ్ సభ్యులను 12కు పెంచింది. ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ అంపైర్లు: క్రిస్ గఫానీ (న్యూజిలాండ్), కుమార్ ధర్మసేన (శ్రీలంక), మరైస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా), మైకేల్ గోఫ్ (ఇంగ్లండ్), నితిన్ మీనన్ (భారత్), పాల్ రీఫిల్ (ఆస్ట్రేలియా), రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్) , రిచర్డ్ కెటిల్‌బరో (ఇంగ్లాండ్), రోడ్నీ టక్కర్ (ఆస్ట్రేలియా), జోయెల్ విల్సన్ (వెస్టిండీస్), అడ్రియన్ హోల్డ్‌స్టాక్ (దక్షిణాఫ్రికా) మరియు అహ్సన్ రజా (పాకిస్థాన్). చదవండి: సంచలనం.. క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన గాయత్రి–ట్రెసా జోడీ క్రికెట్‌పై అభిమానం.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా -
మహిళా అంపైర్‌గా కొత్త చరిత్ర
కేప్‌టౌన్: గత నెలలో ముగిసిన మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయర్ ఫైనల్ మ్యాచ్‌తో పాటు ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ వుమెన్స్ క్రికెటర్ లారెన్ ఏజెన్‌బాగ్.. ఇప్పుడు పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. దక్షిణాఫ్రికా ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు లారెన్‌ను అంపైర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. దాంతో పురుషుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌కు ఎంపికైన తొలి మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. దక్షిణాఫ్రికాలో స్టాండర్డ్ మహిళా అంపైర్‌గా తన బాధ్యతలు నిర్వర్తిసున్న లారెన్‌పై ఆ దేశ క్రికెట్ బోర్డు తాత్కాలిక డైరెక్టర్ కోరీ వాన్ జిల్ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే తన ప్రతిభను ప్రపంచానికి చూపించిన లారెన్ తన అంకితం భావంతో మరిన్ని కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు. మిగతా మహిళా క్రికెటర్లకు ఆమె ఒక స్ఫూర్తిగా నిలిచిపోతుందని కోరీ వాన్ ధీమా వ్యక్తం చేశారు. ఐసీసీ మహిళా అంపైర్ల ప్యానల్లో సభ్యురాలిగా ఉన్న లారెన్.. వరల్డ్ టీ20లో క్వాలిఫయర్ మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. -
అంపైరింగ్ కు మహనామా గుడ్ బై!
దుబాయ్:అంతర్జాతీయ క్రికెట్ లో సుదీర్ఘమైన సేవలందించిన రోషన్ మహనామా తన అంపైరింగ్ జీవితానికి త్వరలో వీడ్కోలు చెప్పనున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఐసీసీ రిఫరీస్ ఎలైట్ ప్యానెల్ లో కొనసాగుతున్న మహనామా అంపైరింగ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. మహనామా కాంట్రాక్టు మరో ఆరు నెలలు ఉన్నా.. కుటుంబంతో అత్యంత సమయం గడపాలనే కారణం చేత ప్యానెల్ నుంచి బయటకొస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ ఏడాది చివర్లో మహనామా అంపైరింగ్ సేవల నుంచి వైదొలిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. శ్రీలంక క్రికెట్ లో విశేష సేవలందించిన మహనామా.. ఐసీసీ ఎలైట్ ప్యానెల్లో 2004 సభ్యత్వం స్వీకరించారు. అటు తరువాత 222 వన్డేలు, 58 టెస్టులు, 35 ట్వంటీ 20 మ్యాచ్ లకు మహనామా అంపైర్ గా, రిఫరీగా పనిచేశారు . ఇందులో మూడు వరల్డ్ కప్ లతో పాటు, 2009లో జరిగిన ఐసీసీ చాంపియ్స్ ట్రోఫీ కూడా ఉండటం విశేషం. దాదాపు 12 సంవత్సరాల పాటు మహనామా ఐసీసీ ప్యానెల్లో కొనసాగారు. అటు ఆటగాడిగా, అంపైర్ గా, రిఫరీగా సుమారు 600 మ్యాచ్ లు అనుభవం మహనామా సొంతం. శ్రీలంక క్రికెట్ జట్టు తరుపున 1986 నుంచి 1999 వరకూ సేవలందించిన మహనామా 52 టెస్టులు, 213 వన్డేలు ఆడారు. 1996 లో శ్రీలంక సాధించిన వరల్డ్ కప్ లో మహనామా సభ్యుడు కావడం మరో విశేషం.