umpiring faults
-
మరోసారి అంపైరింగ్ తప్పిదం.. ఈసారి రోహిత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్ అపహాస్యానికి గురవుతున్నట్లు సుస్పష్టమవుతుంది. మ్యాచ్ తొలి రోజు రహానే విషయంలో జరిగిన పొరపాటే రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ విషయంలోనూ పునరావృతం కావడం ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు యావత్ క్రీడాభిమానులకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఫీల్డ్ అంపైర్ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్ అంపైర్ కూడా అదే తప్పును రిపీట్ చేస్తే.. అది జట్టు జయాపజయాలపైనే కాకుండా అంపైరింగ్ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. రెండో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్యూ విషయంలో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతి మిడిల్ స్టంప్‌ను తాకే దిశగా పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ షాట్ అడే ప్రయత్నం చేశాడన్న కారణంగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూ చూసిన థర్డ్ అంపైర్ బంతి ఆఫ్ స్టంప్ అవతలి నుంచి వెళ్తుందని కన్ఫర్మ్ చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో మాత్రం రోహిత్ ఎటువంటి షాట్‌కు ప్రయత్నించిన దాఖలాలు కనబడలేదు. బంతి మిడిల్ స్టంప్‌ను తాకుతుందని సుస్పష్టంగా తెలుస్తోంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విస్మయానికి గురైన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ సైతం తన అసహనాన్ని తెలియజేశాడు. కాగా, తొలి రోజు ఆటలో సైతం రహానే అంపై'రాంగ్' నిర్ణయం వల్ల బతికిపోయిన సంగతి తెలిసిందే. జాక్ లీచ్ వేసిన బంతి రహానే గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలో స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకి వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా పొరపాటు చేసి రహానేను నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఎల్బీడబ్యూ యాంగిల్లోనే పరిశీలించి, క్యాచ్ అవుట్ విషయాన్ని విస్మరించాడు. ఏదిఏమైనప్పటికీ ఇటు వంటి అంపై'రాంగ్' నిర్ణయాలు ఆటగాళ్లలో తప్పుడు అభిప్రాయాన్నినింపేస్తాయి. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్, 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అశ్విన్ 5 వికెట్లతో రాణించాడు. If that’s a shot then I’m a rockstar #INDvEND pic.twitter.com/eTfNvW6V84 — simon hughes (@theanalyst) February 14, 2021 -
ఫీల్డ్ అంపైర్ల బుద్ధి మందగించిందా?
దుబాయ్: కరోనా దెబ్బతో ఇళ్లకే పరిమితమై ఎంటర్టైన్మెంట్కు మొహం వాచిపోయిన జనాలను ఖుషీ చేయడానికి క్యాష్ రిచ్ క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ప్రారంభమైంది. చెన్నై, ముంబై మధ్య తొలి మ్యాచ్ మామూలుగా సాగిపోయినా, ఢిల్లీ-పంజాబ్ మధ్య ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ మాత్రం అసలైన మజా అందించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. మయాంక్ అగర్వాల్ పోరాట పటిమతో పంజాబ్ గెలుపు దిశగా పయనించింది. అయితే, అనూహ్యంగా అగర్వాల్ ఔటవడంతో... మ్యాచ్ టైగా ముగిసింది. చివరి వరకూ లక్ష్యం చేతులు మారుతూ వచ్చిన ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలింది. అయితే, అంపైర్ల తప్పుడు నిర్ణయంతో తమకు అన్యాయం జరిగిందని పంజాబ్ అభిమానులు సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. టెక్నాలజీ జోక్యం ఎక్కువ కావడంతో అంపైర్ల బుద్ధి మందగించిందని చురకలు వేస్తున్నారు. పంజాబ్ యజమాని ప్రీతి జింటా కూడా అంపైర్లను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. విషమేంటంటే.. 157 పరుగుల లక్ష్య ఛేదనలో మయాంక్ అగర్వాల్ అద్భుత ఇన్నింగ్స్‌తో పంజాబ్ గెలుపు దిశగా సాగుతోంది. బ్యాట్‌తో మెరిసిన ఢిల్లీ ఆటగాడు స్టొయినిస్ ఇన్నింగ్స్ 19 వ ఓవర్ బౌలింగ్ చేశాడు. స్ట్రైకింగ్‌లో ఉన్న మయాంక్ షాట్ కొట్టడంతో రెండు పరుగులొచ్చాయి. అయితే, ఓవర్ పూర్తవగానే.. పంజాబ్ ఇన్నింగ్స్‌కు అంపైర్లు ఒక పరుగు కోత విధించారు. (చదవండి: పంజాబ్ సూపర్ ఫ్లాప్...) నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న క్రిస్ జోర్డాన్ తొలి పరుగు తీసే క్రమంలో షార్ట్ రన్ చేశాడంటూ చెప్పారు. దాంతో చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సిన పరిస్థితి. 13 పరుగులు కావాల్సిన తరుణంలో 12 పరుగులు చేసిన తర్వాత మయాంక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ఒక్కసారిగా ఉత్కంఠ. ఇక చివరి బంతికి జోర్డాన్ ఔట్ కావడంతో మ్యాచ్ టై గా ముగిసింది. సూపర్‌లో ఓవర్లో పంజాబ్ రెండు పరుగులే చేయడంతో ఢిల్లీ మూడు పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి విజయం సాధించింది. టీవీ రీప్లేలో మాత్రం జోర్డాన్ పరుగును పూర్తి చేసినట్టే కనిపించింది. (చదవండి: ఒక షార్ట్ రన్ నన్ను తీవ్రంగా దెబ్బతీసింది) Standard of umpiring is once again under the criticism. Why not @bcci takes a cognizance into it?? Technology fucked the umpire's attention literally 😬 #IPL2020 #DCvKXIP pic.twitter.com/B9dz3GMUf3 — Pradhumn- CSKian 💛 (@pradhumn_pratap) September 21, 2020 -
అంపైరింగ్ తప్పులతో ఆట మారిపోయింది: ధోనీ
ఆడలేక మద్దెల ఓడన్నట్లు ఉంది.. విదేశాల్లో ఆడేటప్పుడు అంపైర్ల తప్పుల వల్లే ఓడిపోయామని చెప్పే భారత క్రికెటర్లు.. సొంత దేశంలో కూడా అదే పల్లవి అందుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన టి-20 మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ నెపాన్ని అంపైర్ల మీదకు నెట్టేశాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డుమినీ చేసిన 68 పరుగులే ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే రెండుసార్లు భారత బౌలర్లు డుమినీని ఎల్బీడబ్ల్యు చేసినట్లు అప్పీలు చేసినా, అంపైర్లు మాత్రం వాళ్లతో ఏకీభవించలేదు. ఆ రెండు సార్లూ అతడు అవుటయినట్లే ఉందని, ఇలాంటి కొన్ని నిర్ణయాల వల్ల మ్యాచ్ మొత్తం మారిపోతుందని ధోనీ వ్యాఖ్యానించాడు. డుమినీ ముందే అవుటైతే ఫలితం వేరేలా ఉండేదని అన్నాడు. చేతిలో మంచి స్కోరు ఉన్నా కూడా.. మన ఫాస్ట్ బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేయడంలో అంతగా విజయం సాధించలేకపోయారని చెప్పాడు.