తాగుబోతుకు.. తాగి వేధించేవాడికి..
గత వారం అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానంలో 8 ఏళ్ల అమ్మాయిని వేధించిన ఆకతాయిని కస్టడీలోనే ఉంచుకోవాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. గ్రేషామ్ కు చెందిన 26 ఏళ్ల చాడ్ కాంప్ అనే వ్యక్తిని ఈ కేసులో అతని తరఫు వాదించేందుకు ఏ లాయర్ ముందుకు రాకపోవడంతో ప్రస్తుతానికి పోర్ట్ ల్యాండ్ లోని జైలులోనే ఉంచాలని జడ్జి తీర్పునిచ్చారు.
విమానంలోని ప్రయాణీకులకు స్నాక్స్ పంచుతున్న సమయంలో కాంప్ తన పక్కనే కూర్చుని ఉన్న చిన్నారిని శారీరకంగా వేధించడం అటెండెంట్ గమనించాడు. అదే సమయంలో అమ్మాయి కళ్లలోంచి కన్నీళ్లు చూసిన అతను వెంటనే కాంప్ ను ముందు వరుస నుంచి లేపి చివరి వరుసలో కూర్చుబెట్టారు.
కాగా, విమానం ఎక్కే ముందు కాంప్ బార్ లో మూడు నుంచి నాలుగు రకాల మిక్స్ డ్ డ్రింక్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. విమానం దిగిన అనంతరం తాను తప్పు చేయలేదని క్షమించాలని అతని పోలీసులను వేడుకున్నాడు. ఈ విషయం పై స్పందించిన జడ్జి మద్యపానం చేసే వారికి, మద్యపానం చేసి లైంగిక దాడులకు పాల్పడే వారి వ్యత్యాసం ఉందని వ్యాఖ్యానించారు.