విజయం దిశగా సౌత్
సెంట్రల్తో దులీప్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: ఓపెనర్ లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 121 బ్యాటింగ్; 12 ఫోర్లు; 5 సిక్సర్లు) భీకరమైన ఫామ్‌తో రెండో ఇన్నింగ్స్‌లోనూ అజేయ సెంచరీతో అదరగొట్టడంతో దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ విజయం దిశగా దూసుకెళుతోంది. 301 పరుగుల లక్ష్యంతో శనివారం తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌత్ జోన్ రాహుల్ దూకుడుతో ఆట ముగిసే సమయానికి 44 ఓవర్లలో వికెట్ నష్టానికి 184 పరుగులు చేసింది. ఆటకు నేడు (ఆదివారం) చివరి రోజు . సౌత్ జట్టు మరో 117 పరుగులు చేస్తే ట్రోఫీ దక్కించుకోవచ్చు.
సౌత్ చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉండడంతో సెంట్రల్ జోన్ పరాభవం ఇక లాంఛనమే. రాహుల్‌తో పాటు అపరాజిత్ (60 బంతుల్లో 30 బ్యాటింగ్; 3 ఫోర్లు; 1 సిక్స్)క్రీజులో ఉన్నాడు. అంతకుముందు తమ రెండో ఇన్నింగ్స్‌లో సెంట్రల్ జోన్ 105.5 ఓవర్లలో 403 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రాబిన్ బిస్త్ (174 బంతుల్లో 112; 8 ఫోర్లు; 4 సిక్సర్లు) శతకం సాధించాడు. ముర్తజా (67 బంతుల్లో 50; 6 ఫోర్లు; 1 సిక్స్) రాణించాడు. ఎస్.గోపాల్‌కు నాలుగు, ఓజాకు మూడు వికెట్లు దక్కాయి.