ఆమెకు వందేళ్ళ జైలు శిక్ష!
వాషింగ్టన్ః కడుపులో బిడ్డ ప్రపంచాన్ని చూడక ముందే హత్యకు పాల్పడిన ఓ మహిళకు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. ఏడు నెలల గర్భవతి అయిన మిచెల్ విల్సిన్స్ పై దాడి చేసి, ఆమె గర్భంలోని శిశువును చిదిమేసిన ఆమెను.. కోర్టు దోషిగా నిర్థారించింది. హత్యాయత్నంతోపాటు, అశాస్త్రీయ గర్భస్రావానికి పాల్పడినందుకు వ్యతిరేకంగా ఆమెకు వందేళ్ళ జైలు శిక్ష విధించింది.
కడుపులోని బిడ్డను కర్కశంగా చంపేసిన వైనానికి దేశం దిగ్భ్రాంతి చెందింది. ఏడు నెలల గర్భవతి మిచెల్ విల్సిన్స్ గర్భంలోని బిడ్డను హతమార్చిన లేన్ కు ఆమెరికా కోర్టు వందేళ్ళ జైలు శిక్ష విధించింది. గత మార్చి నెలలో తన ఇంటికి వచ్చిన 27 ఏళ్ళ మిచెల్ ను నమ్మించిన 35 ఏళ్ళ విల్కిన్ ఆమె కడుపులోని బిడ్డను దొంగిలించడంలో భాగంగా ఆమెపై దాడి చేసింది. బలవంతంగా గర్భస్రావం చేసి బిడ్డను హత్య చేసింది. ఆశాస్త్రీయ గర్భస్రావంతో పాటు, బిడ్డను హత్య చేయడం, లేన్ అహంకార పూరిత, దుర్మార్గపు ప్రవర్తనకు నిదర్శనమని కోర్టు అభిప్రాయపడింది. జౌల్దర్ జిల్లా జడ్జి బెర్కెన్ కొట్టర్... లేన్ ప్రవర్థన క్రూరమైనదిగా అభివర్ణించారు. ఎవరైనా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారా? అంటూ న్యాయమూర్తి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విల్కిన్ తండ్రి కూడ లేన్ ప్రవర్తన హింసాత్మకమన్నారు.
అయితే దాడి అనంతరం తనకేం తెలియనట్లుగా చనిపోయిన పిండాన్ని ఆస్పత్రికి తెచ్చిన లేన్.. గర్భస్రావం జరిగినట్లు తమను నమ్మించేందుకు చూసిందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆమె కట్టుకథపై అనుమానించిన వైద్యాధికారులు పోలీసులకు రిపోర్టు చేయడంతో అనంతరం ఆమెను అరెస్టు చేశారు.