ఫైనల్లో సాయి దేదీప్య
సాక్షి, హైదరాబాద్: నేషనల్ సిరీస్ అండర్-16 టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి సాయి దేదీప్య ఫైనల్లోకి దూసుకెళ్లింది. మహారాష్ట్రలోని పంచగనిలో జరుగుతోన్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సెమీస్లో సాయి దేదీప్య 6-4, 6-2తో పూజ (మహారాష్ట్ర)పై గెలుపొంది తుదిపోరుకు అర్హత సాధించింది.
ఫైనల్లో సారుుదేదీప్య కర్ణాటకకు చెందిన ప్రతిభతో తలపడుతుంది. డబుల్స్ విభాగంలోనూ సాయి దేదీప్య-ధరణ ముదలియార్ జంట ఫైనల్కు చేరింది.