హైదరాబాద్ కెప్టెన్గా యతిన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో పాల్గొనే అండర్-23 హైదరాబాద్ క్రికెట్ జట్టును శనివారం ప్రకటించారు. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 10 నుంచి నవంబర్ 3 వరకు జరుగుతుంది. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్టుకు యతిన్ రెడ్డి కెప్టెన్గా... తనయ్ త్యాగరాజన్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యారు. అర్జున్ యాదవ్ కోచ్గా వ్యవహరించనున్నారు.
జట్టు: బి. యతిన్ రెడ్డి (కెప్టెన్), రోహిత్ రాయుడు, వై. చైతన్య కృష్ణ, పి.ఎస్. చైతన్యరెడ్డి, టి. రవితేజ, తనయ్ త్యాగరాజన్, ప్రణీత్ రెడ్డి, టి.పి. అనిరుధ్, సయ్యద్ అహ్మద్, మోహిత్ సోని, జె. మల్లికార్జున్, బి. చంద్రశేఖర్, పి. రోహిత్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, రాహుల్.