పరువునష్టం దావా సరైందే: సుప్రీం
న్యూఢిల్లీ: పరువు నష్టం దావా ఇండియన్ పీనల్ కోడ్ కిందకే వస్తుందని సుప్రీంకోర్టు స్సష్టం చేసింది. ఐపీసీ సెక్షన్ 499, 500ల కింద రెండేళ్లు జైలు శిక్ష విధించే నిబంధన కాలం చెల్లిందిగా దీనిని సమీక్షించాల్సిందిగా దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు శుక్రవారం తీర్పు నిచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ లను జస్టిస్ ఫ్రఫుల్ల సీ పంత్, దీపక్ మిశ్రా లతో కూడిన బెంచ్ విచారించింది.
భావ ప్రకటనా స్వేచ్ఛకూ సహేతుకమైన పరిమితులుంటాయని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రైవేట్ పరువు పరువు నష్టం దావా కేసులో సమన్లు జారీ అయితే ఎనిమిది వారాల్లోగా హైకోర్టును ఆశ్రయించవచ్చునని, ఆసమయంలో వారికి రక్షణ ఉంటుదని కోర్టు స్పష్టం చేసింది.