స్టూలు వేసుకుని.. స్టైల్‌గా.. .
షూ కింద స్టూల్ తగిలించుకుని నడుస్తున్న ఈ కుర్రాడి పేరు జావో కియాంగ్. చైనాలోని షెన్యాంగ్లో ఉంటాడు. ఇదేదో స్టైల్ కోసం వేసుకున్నది కాదు. ఇతడికి చిన్న వయసులోనే వచ్చిన అనారోగ్య సమస్య వల్ల ఎడమ కాలు సరిగా ఎదగలేదు. దీంతో కుడికాలుతో పోలిస్తే.. ఎడమ కాలు ఈ మేరకు తగ్గింది. నడవడానికి ఇబ్బంది పడుతున్న కియాంగ్‌ను చూసిన అతడి మామకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే అతడి షూలకు ఈ చిన్నపాటి స్టూల్‌ను ఫిట్ చేసేశాడు. దీని సాయంతో కియాంగ్ ఎంచక్కా నడవగలుగుతున్నాడు.