unfilled
-
వెలవెలబోతున్న ఇంజనీరింగ్ కళాశాలలు
సగంసీట్లు కూడా భర్తీకాని వైనం మొదటి విడతలో 56 శాతమే... రెండో విడతపైనే ఆశలు..లేకుంటే నిర్వహణ కష్టమే ఫీజుల కుదింపుతో డిగ్రీలో చేరుతున్న విద్యార్థులు ఖమ్మం: ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్ లేకపోవడం ఒక కారణం అయితే ఈ సారి ప్రభుత్వం బీసీ, ఓసీ విద్యార్థులకు ఫీజుల కుదింపుతో అదనపు భారంతో ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. గతంలో తొలి విడత జాబితాలో 80శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈ సారి మాత్రం 56శాతం సీట్లు మా్ర™ృlమే నిండాయి. వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించగా..జిల్లాలో మొత్తం 16 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 4,215 సీట్లు ఉండగా.. మొదటి జాబితాలో 2,369 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో సీట్లు నిండాయి. డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి వాటిల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం కుదించింది. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు లోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో కేవలం ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య భారంగా మారింది. సంవత్సరానికి కళాశాల ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన డబ్బులు విద్యార్థులే కట్టుకోవాలనే నిబంధన ఉంది. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60వేల నుంచి 40వేల లోపు ఉండగా..ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్ఫీజు, ఇతర చార్జీలు భారమవుతాయని భావిస్తున్నారు. అందుకే చాలామంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మొదటి జాబితాలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కోర్సు సీట్లు భర్తీ అయినవి మిగులు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సీఐవి 546 329 217 సీఎస్ఈ 880 671 209 ఈసీఈ 1026 546 480 ఈఈఈ 922 447 475 ఎంఈసీ 756 291 465 ఎంఐఎన్ 25 25 – ఐఎన్ఎఫ్ 60 60 – ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 4,215 2,369 1846 ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
వెలవెలబోతున్న ఇంజనీరింగ్ కళాశాలలు
సగంసీట్లు కూడా భర్తీకాని వైనం మొదటి విడతలో 56 శాతమే... రెండో విడతపైనే ఆశలు..లేకుంటే నిర్వహణ కష్టమే ఫీజుల కుదింపుతో డిగ్రీలో చేరుతున్న విద్యార్థులు ఖమ్మం: ఆశించిన స్థాయిలో ప్లేస్మెంట్ లేకపోవడం ఒక కారణం అయితే ఈ సారి ప్రభుత్వం బీసీ, ఓసీ విద్యార్థులకు ఫీజుల కుదింపుతో అదనపు భారంతో ఇంజనీరింగ్ చదివేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తున్నారు. డిగ్రీ కోర్సుల్లో చేరుతున్నారు. గతంలో తొలి విడత జాబితాలో 80శాతం సీట్లకు పైగా భర్తీ కాగా ఈ సారి మాత్రం 56శాతం సీట్లు మా్ర™ృlమే నిండాయి. వెబ్ ఆప్షన్ ద్వారా ఎంచుకున్న కళాశాలల జాబితాను జేఎన్టీయూ అధికారులు ప్రకటించగా..జిల్లాలో మొత్తం 16 ఇంజనీరింగ్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో 4,215 సీట్లు ఉండగా.. మొదటి జాబితాలో 2,369 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇందులో ప్రధానంగా నాలుగు కళాశాలల్లో మాత్రమే ఆశించిన స్థాయిలో సీట్లు నిండాయి. డిమాండ్ ఉన్న కోర్సులు సివిల్, సీఎస్ఈ, ఈసీఈ, ఈఈఈ వంటి వాటిల్లో కూడా పలు కళాశాలల్లో ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. ఫీజు కుదింపుతో విద్యార్థుల వెనుకంజ.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం కుదించింది. ఎంసెట్‌లో 10వేల లోపు ర్యాంకు లోపు వచ్చిన వారికే మొత్తం ఫీజు చెల్లిస్తామని, ఎక్కువ ర్యాంకు వచ్చిన వారిలో కేవలం ఎస్సీ, ఎస్టీల ఫీజులు మాత్రం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బీసీ, ఓసీ విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య భారంగా మారింది. సంవత్సరానికి కళాశాల ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తూ, మిగిలిన డబ్బులు విద్యార్థులే కట్టుకోవాలనే నిబంధన ఉంది. జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలల ఫీజు రూ. 60వేల నుంచి 40వేల లోపు ఉండగా..ప్రభుత్వం చెల్లించే ఫీజు పోగా మిగిలినవి ఎలా చెల్లించాలని, ఫీజుతోపాటు జేఎన్టీయూ, బస్ఫీజు, ఇతర చార్జీలు భారమవుతాయని భావిస్తున్నారు. అందుకే చాలామంది డిగ్రీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. – మొదటి జాబితాలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– కోర్సు సీట్లు భర్తీ అయినవి మిగులు ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సీఐవి 546 329 217 సీఎస్ఈ 880 671 209 ఈసీఈ 1026 546 480 ఈఈఈ 922 447 475 ఎంఈసీ 756 291 465 ఎంఐఎన్ 25 25 – ఐఎన్ఎఫ్ 60 60 – ––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 4,215 2,369 1846 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––