టి20లో 313 పరుగుల విజయం
దుబాయ్: ఓ టి20 మ్యాచ్‌లో 300 పరుగులు చేయడమే కష్టం. అలాంటిది ఓ జట్టు 313 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేస్తే ఆశ్చర్యమే. ఈ అద్భుతం షార్జాలో జరిగింది. బుఖాతిర్ టి20 లీగ్‌లో భాగంగా యునికాన్ క్రికెట్ క్లబ్ 313 పరుగులతో ముసాఫిర్ క్లబ్‌ను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన యునికాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 364 పరుగులు చేయగా... ముసాఫిర్ క్లబ్ 10.3 ఓవర్లలో 53 పరుగులకు ఆలౌటయింది. క్రికెట్ రికార్డుల్లోకి ఇది చేరకపోయినా... క్లబ్‌స్థాయి క్రికెట్లో ఇంత పెద్ద విజయం అద్భుతమే.