unidentified assaults
-
పెట్రోల్ పోసి వ్యక్తిని తగలబెట్టిన దుండగులు
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మండలం నర్లపల్లిలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన ఘటన బుధవారం వెలుగుచూసింది. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చూరీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. -
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించారు
-
మహిళను తాళ్లతో కట్టి నిప్పుటించాడు
(కర్నూలు)కొలిమిగుండ్ల: డబ్బులివ్వనందుకు వెంకటిబాయి అనే మహిళను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఘనుడు. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయిపల్లె ఎస్టీ తండాలో జరిగింది. అదే గ్రామానికి చెందిన శ్రీను నాయక్, వెంకటి బాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. మంగవారం రాత్రి తన అవసరాల కోసం డబ్బులు ఇవ్వనందుకు శ్రీను నాయక్, వెంకటిబాయిని మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. స్థానికులు కొన ఊపిరితో ఉన్న వెంకటిబాయిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది. చనిపోయే ముందు ఆమె మరణ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
మహిళను బండరాయితో మోది చంపిన దుండగులు
మహబూబ్ నగర్: జిల్లాలోని ఆత్మకూరు మండలం మూలమళ్లలో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను బండరాయితో మోది అతిదారుణంగా హతమార్చిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. రక్తపు మడుగులో పడివున్న మృతదేహన్ని పరిశీలించగా.. వెంకటమ్మ అనే మహిళగా పోలీసులు గుర్తించారు. వెంకటమ్మ హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.