కేంద్ర మంత్రులతో వెంకయ్య భేటీ
ముగ్గురు కేంద్ర మంత్రులతో పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు భేటీ అయ్యారు. స్థానికత అంశంపై ఆంధ్ర ప్రధేశ్ కేంద్రానికి రాసిన లేఖ నేపధ్యంలో.. దీనిపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులతో వెంకయ్యనాయుడు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా వెంకయ్య వారికి వివరించారు. ఇక స్థానికత అంశంపై ఏపీ కోరుకున్నట్లు ఆదేశాలు ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది.