Union Minister Uma Bharati
-
సెక్షన్ 497పై తీర్పు : ఉమా భారతి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : వివాహేతర సంబంధం నేరం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన వేళ కేంద్ర మంత్రి ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. సమానత్వం అనేది విదేశాల కాన్సెప్ట్.. కానీ మన దేశంలో మహిళను మగవారి కంటే ఎక్కువగా చూస్తాం అని తెలిపారు. వివాహేతర సంబంధాల గురించి కోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా ఉమా భారతి మీడియాతో మాడుతూ ‘జనాలు ప్రతి చిన్న విషయానికి కోర్టుకు ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. మన దేశంలో మహిళలను చాలా గౌరవిస్తాం. మన సమాజంలో ఆడవారికి ఉన్నత స్థానం ఉంది. మన దేశంలో మగవారి కంటే ఆడవారే ఎక్కువ. స్త్రీలను గౌరవించని చోట రాక్షసులు నివాసం ఉంటారని నానుడి. అలాంటి దేశంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలంటూ కోర్టుకెళ్లడం సరైంది కాదు’ అంటూ తెలిపారు. వివాహేతర సంబంధాన్ని నేరంగా పరిగణిస్తున్న సెక్షన్ 497ను సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. ఈ నిబంధనను 158 ఏళ్ల క్రితం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది ఏకపక్ష, పురాతన నిబంధన అని ధర్మాసనం పేర్కొంది. ఈ సెక్షన్ మహిళలకు ఉన్న సమానత్వ హక్కు, సమాన అవకాశాల హక్కును హరించేదిగా ఉందని తెలిపిన నేపధ్యంలో ఉమా భారతి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వివాహేతర సంబంధం నేరం కాదు -
దేవాదులను ఏఐబీపీలో చేర్చాలి
కేంద్రానికి ఎంపీ కవిత వినతి సాక్షి, న్యూఢిల్లీ: యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ)లో రాష్ట్రంలోని దేవాదుల, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్టులను చేర్చి, నిధులను కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. సోమవారం ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి ఈ ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉమాభారతి దీనిపై సానుకూలంగా స్పందించారని కవిత చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేదశలో ఉన్నందున వెంటనే నిధులు విడుదల చేస్తే 2017 నాటికల్లా వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీరందించే వీలుంటుందని కవిత చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై స్పందిస్తూ, వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించారని, ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని, ఈ ఏడాది కేంద్రం ఆ దిశ గా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు. -
ఓ పిచ్చోడు గాంధీని చంపాడు
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీని ఓ పిచ్చివాడు చంపేశాడని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. గాంధీ సిద్ధాంతం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉంటుందన్నారు. గాంధీజీ వర్ధంతి సందర్భంగా ‘స్వచ్ఛ్ గంగ- గ్రామీణ్ సహ్భాగిత’ పేరిట ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శనివారం ఆమె ప్రసంగించారు. గంగానదీ తీరాన ఉన్న గ్రామ పంచాయతీ పెద్దలంతా గంగానది ప్రక్షాళన కోసం కృషి చేయాలని కోరారు. భారత ఆత్మ గ్రామాల్లోనే ఉందని గాంధీజీ అన్నారని.. జాతిపిత వర్ధంతి రోజున గంగానది ప్రక్షాళనకు గ్రామాల పెద్దలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టడం శుభపరిణామమని ఆమె అన్నారు. గంగానది ప్రక్షాళనకు గత 29 ఏళ్లుగా రూ. 4 వేల కోట్లు వ్యయం చేసినా ప్రయోజనం సిద్ధించలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.