దేవాదులను ఏఐబీపీలో చేర్చాలి | MP Kavita Request to central government | Sakshi
Sakshi News home page

దేవాదులను ఏఐబీపీలో చేర్చాలి

Published Tue, Mar 1 2016 2:42 AM | Last Updated on Thu, Aug 9 2018 4:51 PM

దేవాదులను ఏఐబీపీలో చేర్చాలి - Sakshi

దేవాదులను ఏఐబీపీలో చేర్చాలి

కేంద్రానికి ఎంపీ కవిత వినతి

 సాక్షి, న్యూఢిల్లీ: యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ)లో రాష్ట్రంలోని దేవాదుల, ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ ప్రాజెక్టులను చేర్చి, నిధులను కేటాయించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత కేంద్రాన్ని కోరారు. సోమవారం ఆమె కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలసి ఈ ప్రాజెక్టులను ఏఐబీపీలో చేర్చాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఉమాభారతి దీనిపై సానుకూలంగా స్పందించారని కవిత చెప్పారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేదశలో ఉన్నందున వెంటనే నిధులు విడుదల చేస్తే 2017 నాటికల్లా వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని, తద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీరందించే వీలుంటుందని కవిత చెప్పారు. సాధారణ బడ్జెట్‌పై స్పందిస్తూ, వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించారని, ప్రాణహిత-చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరిందని, ఈ ఏడాది కేంద్రం ఆ దిశ గా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement