Union Ministry of Water Resources
-
పరిశీలనలో కృష్ణా కొత్త ట్రిబ్యునల్
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాల మధ్య పునః పంపిణీ చేయాలని, ఇందుకోసం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ డిమాండ్ పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖకు రిఫర్ చేశామని, తరచూ సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కృష్ణా (కేఆర్ఎంబీ), గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ)ల పరిధిని నోటిఫై చేస్తూ ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్‌కు సంబంధించి శుక్రవా రం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థీ, కేంద్ర జలవనరుల సంస్థ (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఎస్.కె.హల్దార్, సీడబ్ల్యూసీ సభ్యుడు కుష్విందర్ వోహ్రా మీడియాతో మాట్లా డారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోని సెక్షన్ 87ను అనుసరించి.. 2020 అక్టోబర్‌లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించిన మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నోటిఫై చేశాం. సీడబ్ల్యూసీ అధికారులు పగలూ రాత్రి పనిచేసి ఒక్కో పదాన్ని జాగ్రత్తగా ఎంచుకుని ఈ నోటి ఫికేషన్ రూపొందించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల విషయంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకోరేమో అన్నంతగా శ్రద్ధగా అన్ని అంశాలను చేర్చారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక బంధం ఉండే దిశగా కేంద్రం చేసిన కృషిలో భాగమే ఈ నోటిఫికేషన్..’’అని వారు వివరించారు. ఏకాభిప్రాయ సాధన కోసమే ఆలస్యం రాష్ట్ర విభజన తర్వాత బోర్డుల పరిధిని నోటిఫై చేసేందుకు ఇన్నేళ్లు పట్టడంపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నీటి పంపిణీ అనే అంశం సున్నితమైంది. కేంద్ర ప్రభుత్వానిది ఇక్కడ ఎంపైర్ పాత్ర. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చాలా కృషి చేయాల్సి వచ్చింది. కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఏపీకి తరలించడం వంటి చిన్న అంశాలపై కూడా ఏకాభిప్రాయ సాధన అవసరమైంది. అపెక్స్ కౌన్సిల్ మొదటి సమావేశం తర్వాత రెండో సమా వేశం జరపడానికి నాలుగేళ్లు పట్టింది. ఆలస్యమైనా అన్నిపక్షాలను ఒక వేదికపైకి తేవడం, 8కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం చర్చించుకునేలా చేయ డం చాలా ముఖ్యమైన ప్రక్రియ’’అని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు, సందేహాలను లేవనెత్తిందని, వాటన్నిం టినీ పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ శాఖ అభిప్రాయం కోరాం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, కృష్ణా జలాలను తిరిగి 4 రాష్ట్రాల మధ్య పంచాలని, ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని.. ఆ తర్వాతే బోర్డులను నోటిఫై చేయాలన్న తెలంగాణ డిమాండ్‌ను ప్రస్తావించగా.. ‘‘అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించాం. సుప్రీంకోర్టులో కేసు విత్‌డ్రా చేసుకుంటే కేంద్రం ఈ అంశాన్ని న్యాయశాఖకు రిఫర్ చేస్తుందని చెప్పాం. కేసు విత్‌డ్రా చేసుకున్నట్టుగా జూన్ రెండో వారంలో తెలంగాణ నుంచి సమాచారం అందింది. తర్వాత మేం న్యాయశాఖకు రిఫర్ చేశాం. వారు మరింత సమాచారం కోరారు. దీనిపై రోజువారీగా వారితో సంప్రదింపులు జరుపుతున్నాం. జలశక్తి మంత్రి కూడా ఇప్పటికే అండర్ టేకింగ్ ఇచ్చారు. న్యాయ విభాగం ఎలాంటి అభిప్రాయం చెప్తుందో తెలియదు. దానికి కట్టుబడి ఉంటాం’’అని అధికారులు స్పష్టం చేశారు. నీళ్లు, కరెంటు పంపిణీపై నియంత్రణ కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల పాలన, నియంత్రణ, నిర్వహణ విషయాలను నోటిఫికేషన్లో చేర్చామని అధికారులు తెలిపారు. కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీరు, విద్యుత్ సరఫరాపై నియంత్రణ కలిగి ఉంటాయని చెప్పారు. ‘‘బోర్డులు, ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చులను రెండు రాష్ట్రాలు సమంగా భరించాలి. నోటిఫికేషన్ జారీ అయిన 60 రోజుల్లోగా రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలి. ఆమోదం పొందని ప్రాజెక్టులు ఏవి అనేది స్పష్టంగా నిర్వచించాం. షెడ్యూళ్లలో ప్రస్తావించిన మాత్రాన ప్రాజెక్టులు ఆమోదం పొందినట్టు కాదు. అవి మదింపు, ఆమోదానికి లోబడి ఉంటాయి. ప్రాజెక్టులను మూడు షెడ్యూళ్లుగా విభజించాం. షెడ్యూల్–2 ప్రాజెక్టులు పూర్తిగా ఆయా బోర్డుల నియంత్రణలో ఉంటాయి. సుహృద్భావంతో నడవని పక్షంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రేపే ప్రాజెక్టులను ఇందులో చేర్చాం. వీటికి సీఐఎస్ఎఫ్ రక్షణ ఉంటుంది. షెడ్యూల్–3లోని ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా నిర్వహించుకోవచ్చు. అయితే బోర్డుల నుంచి మార్గదర్శనం తీసుకోవాల్సి ఉంటుంది.’’అని తెలిపారు. ఆమోదం పొందని ప్రాజెక్టులంటే.. ఆమోదం పొందని ప్రాజెక్టులను ఎలా నిర్ధారిస్తారని మీడియా ప్రశ్నించగా.. ‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల, బహుళార్ధ సాధక ప్రాజె క్టు ఇలా ఏదైనా సరే.. ఆయా బోర్డుల ద్వారా మదింపు పొందనివి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం తీసుకోనివి, సాగునీరు, బహుళార్ధ సాధక, వర దల సలహా కమిటీ అనుమతి పొందనివి, ఆమోదం పొందిన తర్వాత ప్రాజెక్టు స్వరూపంలో మార్పులు జరిగినవి అన్నీ కూడా ఆమోదం పొందని ప్రాజెక్టుల జాబితాలో ఉంటా’’యని కేంద్ర అధికారులు వివరించారు. -
జల వివాదాలకు చెక్.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో తరచూ రేగుతున్న జల వివాదాలకు చెక్‌పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడేళ్లుగా ఎటూ తేలకుండా వాయిదా పడుతూ వస్తున్న కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ గురువారం అర్ధరాత్రి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా బోర్డు సమర్ధవంతంగా పనిచేసేందుకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) బ్యాంక్ అకౌంట్లోకి 60 రోజుల్లోగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు చెరో రూ.200 కోట్ల చొప్పున జమ చేయాలని సూచించింది. నోటిఫికేషన్ విడుదలతో కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ఉమ్మడి ప్రాజెక్టులు, వాటి నిర్వహణ, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిబ్బంది అంతా బోర్డుల పరిధిలోకి వచ్చాయి. ప్రాజెక్టుల నీటి నిర్వహణతో పాటు భద్రతను కేంద్ర బలగాలు పర్యవేక్షించనున్నాయి. ఈ నోటిఫికేషన్ జారీ చేసే నాటికి కేంద్రం ఆమోదించని ప్రాజెక్టుల పనులన్నింటిని ఇరు రాష్టాలు నిలిపివేయాలని పేర్కొంది. రెండో అపెక్స్ కౌన్సిల్ భేటీలో నిర్ణయించిన మేరకు అనుమతులు లేని ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్‌కు పంపి 6 నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని సూచించింది. ఆరు నెలల్లో అనుమతి పొందకపోతే ఆ ప్రాజెక్టులను రద్దు చేసుకోవాలని, వాటి ద్వారా ఎలాంటి నీటిని తీసుకోరాదని స్పష్టం చేసింది. ఈ నోటిఫికేషన్ ఈ ఏడాది అక్టోబర్ 14 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం వివరించింది. బోర్డుల పరిధిపై కుదరని అభిప్రాయం.. కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం.. బోర్డులను ఏర్పాటు చేసింది. అయితే బోర్డులకు.. వాటి పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్‌ను నోటిఫై చేయకపోవడంతో వీటికి ఎలాంటి అధికారాలు లేవు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నా బోర్డులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ క్రమంలో తమ పరిధిని ఖరారు చేసి ప్రాజెక్టులపై పెత్తనం ఇవ్వాలని బోర్డులు కోరాయి. దీనిపై తెలంగాణ, ఏపీ మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చిన జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించలేదని, ఈ అంశంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని పేర్కొంది. విభజన చట్టం సెక్షన్–87 ప్రకారం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేశాకనే బోర్డు పరిధిని నోటిఫై చేయాలని.. 2016, సెప్టెంబర్ 21న జరిగిన తొలి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ, 2020, అక్టోబర్ 6న జరిగిన రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. అయితే ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తేవాల్సిందేనని ఏపీ ఎప్పటి నుంచో కోరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణ పరిధిలో ఉన్న కారణంగా ఆ రాష్ట్ర అధికారులు ప్రాజెక్టుపై పెత్తనం చేస్తున్నారని, తమ రాష్ట్రానికి నీరందించే కుడి కాల్వపై వారి పెత్తనమే కొనసాగుతున్న దృష్ట్యా బోర్డు నియంత్రణ అవసరమని చెబుతూ వచ్చింది. ఈ వైరుధ్యాలు ఉన్నా.. రెండో అపెక్స్ భేటీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బోర్డుల పరిధిని ఖరారు చేసే అధికారం తమకుందని స్పష్టం చేశారు. అనంతరం ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో దీనిపై చర్చించి నోటిఫికేషన్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. గోదావరి.. బోర్డు పరిధిలోకి ఎందుకు... ఇక గోదావరి బేసిన్ ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెచ్చుకోవడాన్ని తెలంగాణ తప్పుపడుతోంది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరురాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టులు లేనందున దీని పరిధిని ఖరారు చేయ రాదని గతంలో కేంద్రానికి లేఖలు రాసింది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివా దాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధికి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాలు లేవని దృష్టికి తెచ్చింది. కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. అయినా దీని పరిధిపైనా గెజిట్ ఇచ్చేందుకే కేంద్రం మొగ్గు చూపింది. కృష్ణా బోర్డు పరిధిలో.. కృష్ణా బోర్డు పరిధి నోటిఫై కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ దాని పరిధిలోకి వెళ్లాయి. అందులో తుంగభద్ర జలాలపై ఆధారపడి ఉన్న హెచ్ఎల్సీ(హైలెవల్ కెనాల్), ఎల్ఎల్సీ(లోలెవల్ కెనాల్), కేసీ కెనాల్, తుమ్మిళ్ల, ఆర్డీఎస్, జూరాలపై ఆధారపడి ఉన్న విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, శ్రీశైలంపై ఆధారపడ్డ తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, హంద్రీనీవా, ముచ్చు మర్రి, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, శ్రీలైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలు, సాగర్‌పై ఆధారపడిన కుడి, ఎడమ కాల్వలు, విద్యుదుత్పత్తి కేంద్రాలు, ఏఎంఆర్పీ, హెచ్ఎండబ్ల్యూఎస్, పులిచింతల వంటి ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వచ్చాయి. అలాగే కాళేశ్వరం, దేవాదుల, నిజాంసాగర్, సింగూరు, ఎస్సారెస్పీ, లోయర్‌మానేరు, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, పోలవరం, ధవళేశ్వరం బ్యారేజీ, చింతలపూడి, పురుషోత్తపట్నం గోదావరి బోర్డు పరిధిలోకి వెళ్లాయి. ప్రధానికి రెండు దఫాలు సీఎం జగన్ లేఖలు బోర్డు పరిధి ఖరారైనందున కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉండదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం కనీస స్థాయి కంటే దిగువన ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్ అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో జూన్ 1నే విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విద్యుదుత్పత్తిని నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. అయితే తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తిని చేపట్టింది. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలిసే పరిస్థితిని సృష్టించి రాష్ట్ర హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండుదఫాలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌సింగ్ షెకావత్‌లకు లేఖలు రాశారు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా బోర్డు పరిధిని తక్షణమే ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తేవాలని, వాటికి సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఇరు రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలని కోరారు. కానీ.. తెలంగాణ సర్కార్ తీరులో మార్పు రాకపోవడంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసేలా కేంద్రానికి నిర్దేశం చేయాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో రెండు బోర్డుల పరిధిని కేంద్రం ఖరారు చేసింది. -
రేపు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల
న్యూఢిల్లీ: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జలశక్తి శాఖ రేపు(శుక్రవారం) గెజిట్లు విడుదల చేయనుంది. రేపు మధ్యాహ్నం 1 గంట తర్వాత కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల చేయనుంది. రెండు బోర్డులకు వేర్వేరుగా కేంద్రం గెజిట్లు విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల జల వివాదం నేపథ్యంలో గెజిట్లకు ప్రాధాన్యమేర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం జల బోర్డుల పరిధి నిర్ధేశించే అధికారం కేంద్రానిదే. దీనిలో భాగంగానే వాటి పరిధిపై కేంద్రం వేర్వేరుగా గెజిట్లు విడుదల చేయడానికి సమాయత్తమైంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వ వైఖరిపై ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ లేఖలో తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా ఆపరేషన్ ప్రొటోకాల్ ఉల్లంఘిస్తోందని, కేఆర్ఎంబీ పరిధిని తక్షణమే నోటిఫై చేసేలా జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అదే సమయంలో శ్రీశైలంలో నీటిమట్టం పెరగకుండా తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తోందని కేంద్రానికి తెలిపారు. పోతిరెడ్డిపాడుకు సాగునీరు రాకుండా తెలంగాణ అడ్డుకుంటోందని, కేఆర్ఎంబీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే.. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. దీంతో కృష్ణా డెల్టా, రాయలసీమ ప్రాంతానికి ఇబ్బంది కలుగుతుందని, రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేలా.. సీఐఎస్ఎఫ్ బలగాల పరిధిలోకి ప్రాజెక్ట్‌లను తేవడమే కాకుండా తక్షణమే తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసేలా.. కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. -
కొత్త ట్రిబ్యునల్‌పై న్యాయ సలహా కోరిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–3 ప్రకారం విచారించేలా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్ర జల శక్తి శాఖ న్యాయ శాఖ సలహా కోరినట్లు తెలిసింది. అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ ఉపసంహరించుకున్న నేపథ్యంలో దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలో తెలపాలని న్యాయ శాఖ కార్యదర్శి అనూప్‌కుమార్‌కు జలశక్తి శాఖ కార్యదర్శి లేఖ రాసినట్లుగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర న్యాయ శాఖ ఇచ్చే సూచనల మేరకు జలశక్తి శాఖ ఈ విషయంలో ముందుకు వెళ్లనుంది. కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్–2 ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాలను.. విభజన చట్టంలోని సెక్షన్–89 ప్రకారం కాకుండా అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్–3 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేసేలా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని గత నెల 16న రాష్ట్రం కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే, న్యాయ నిపుణుల సలహాతో ట్రిబ్యునల్ ఏర్పాటుపై తగిన చర్యలు తీసుకుంటామని అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఇచ్చిన హామీని లేఖలో తెలంగాణ ప్రస్తావించింది. -
నీటి సంరక్షణ అందరి బాధ్యత
న్యూఢిల్లీ: దేశంలో నీటి సంరక్షణ అందరి బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రుతుపవనాలు ప్రవేశించడానికి ముందే చెరువులు, కాల్వలు, సరస్సుల్లో పూడికలు తీసి ప్రతీ వాన చినుకుని సంరక్షించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని వాన చినుకులు ఎప్పుడు పడినా, ఎక్కడ పడినా బొట్టు బొట్టు ఒడిసిపట్టి సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. వాన నీటిని పూర్తిగా సద్వినియోగం చేయడం కోసం చెరువులు, కాల్వలు నిర్వహణపై కేంద్ర జల మంత్రిత్వ శాఖ క్యాచ్ ది రెయిన్ అనే 100 రోజుల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు చెందిన బబితా రాజ్పుట్ నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని అభినందించారు. తమ గ్రామంలో ఎండిపోయిన చెరువులకి జలకళ తీసుకువస్తున్న ఆమె కృషి అందరికీ ఆదర్శమన్నారు. తమిళం నేర్చుకోనందుకు బాధగా ఉంది ప్రపంచంలోనే అత్యంత పురాతమైన భాషల్లో ఒకటైన తమిళం నేర్చుకోలేకపోయినందుకు చాలా బాధగా ఉందని ప్రధాని∙మోదీ అన్నారు. తమిళం చాలా అందమైన భాషని, సుసంపన్నమైన సాహి త్యం ఉన్న ఆ భాషని నేర్చుకోలేకపోవడం లోటుగా ఉంటుందని చెప్పారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు అపర్ణ రెడ్డిజీ అడిగిన ఓ చ్రిన్న ప్రశ్న అయినప్పటికీ తనని వెంటాడిందని అన్నారు. ‘‘మీరు చాలా ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానిగా కూడా ఉన్నారు. జీవితంలో ఏదైనా మిస్ అయ్యారా’’అని ఆమె ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమైందన్నారు. ఆ తర్వా త ఆలోచిస్తే తమిళ భాషని నేర్చుకోవడం మిస్ అయినట్టుగా అనిపించిందని ప్రధాని వివరించారు. పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి ప్రస్తావన ఈ సందర్భంగా ప్రధాని హైదరాబాద్ రైతు పద్మశ్రీ చింతల వెంకటరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించారు. వెంకటరెడ్డి లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తిని పొందాలని సూచించారు. డి–విటమిన్ అధికంగా ఉండే వరి, గోధుమ రకాలను వెంకటరెడ్డి అభివృద్ధి చేశారని చెప్పారు. ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ నుంచి పేటెంట్ కూడా పొందారని తెలిపారు. ఆయనను గత ఏడాది పద్మశ్రీతో గౌరవించుకోవడం గర్వకారణమన్నారు. -
నిధులిస్తే నిర్విఘ్నంగా..
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం సోమవారం పార్లమెంట్లో 2021–22 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాతీయ ప్రాజెక్టు పోలవరానికి ఏ మేరకు నిధులు కేటాయిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పోలవరాన్ని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ఈ సీజన్లో అంటే గోదావరికి వరదలు వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనులకు రూ.10 వేల కోట్లు అవసరమని అంచనా వేసింది. ఆ మేరకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. పోలవరానికి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించడంతోపాటు ‘రివాల్వింగ్ ఫండ్’ ఏర్పాటు చేయాలని విజæ్ఞప్తి చేసింది. అవసరమైన మేరకు నిధులు విడుదల చేస్తే దశాబ్దాల కల పోలవరం సాకారమయ్యేందుకు మార్గం సుగమం అవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. మూడుసార్లు బడ్జెట్లోనే.. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వంద శాతం ఖర్చును భరించి తామే పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు 2014–15, 2015–16, 2016–17లో బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ వచ్చింది. అయితే పోలవరం నిర్మాణ బాధ్యతను టీడీపీ హయాంలో గత సర్కారుకు అప్పగించిన సమయంలో అంటే 2016 సెప్టెంబరు 8న నిధుల మంజూరుపై మెలిక పెట్టింది. నాబార్డు (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) వద్ద ఏర్పాటు చేసే ఎల్‌టీఐఎఫ్ (దీర్ఘకాలిక నీటిపారుదల నిధి) నుంచి రుణం తీసుకుని ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా విడుదల చేస్తామని పేర్కొంది. దీంతో 2017–18 నుంచి 2020–21 వరకూ ఏ బడ్జెట్లోనూ పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. నాబార్డు నుంచి రుణం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్ చేస్తూ వస్తోంది. ఇప్పటికి రూ.10,741.76 కోట్లే విడుదల.. పోలవరం ప్రాజెక్టుకు 2014 ఏప్రిల్ 1కి ముందు అంటే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,135.87 కోట్లను ఖర్చు చేసింది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) టీఏసీ (సాంకేతిక సలహా మండలి) ఆమోదం తెలిపింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ.47,725.74 కోట్లుగా పోలవరం సవరించిన అంచనా వ్యయాన్ని నిర్ధారించింది. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన ప్రకారం తీసుకుంటే పోలవరం నీటిపారుదల వ్యయం రూ.51,532.23 కోట్లు ఉంటుంది. కాగా 2014 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు రూ.12,295.93 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.10,848.38 కోట్లను కేంద్ర ప్రభుత్వం పీపీఏకు విడుదల చేయగా రూ.10,741.76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి విడుదలయ్యాయి. ఇంకా రూ.1,554.17 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. కేంద్రం రీయింబర్స్ చేసిన మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే నీటిపారుదల వ్యయం రూపంలో పోలవరానికి ఇంకా రూ.35,654.60 కోట్లను కేంద్రం మంజూరు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ ద్వారా కేటాయించాలని ప్రతిపాదన.. పోలవరాన్ని 2022 ఖరీఫ్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని పనులు చేస్తున్నామని, గోదావరికి వరద వచ్చేలోగా పూర్తి చేయాల్సిన పనుల కోసం రూ.పది వేల కోట్లను జూన్‌లోగా విడుదల చేయాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. పునర్విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి బడ్జెట్ ద్వారా నిధులు కేటాయించాలని విజæ్ఞప్తి చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌లకు ఇదే అంశంపై పలు మార్లు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రివాల్వింగ్ ఫండ్ రూపంలో నిధులను మంజూరు చేస్తే పోలవరం పనులకు ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయవచ్చని, తద్వారా అంచనా వ్యయం పెరగకుండా అడ్డుకట్ట వేయవచ్చని ప్రతిపాదించారు. -
‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!
నీటి వినియోగంలో గత ఒప్పందాన్ని కొనసాగించాలన్న తెలంగాణ బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ బోర్డు పర్యవేక్షణలో నీటి పంపకాలకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గతేడాది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంతో రూపొందించుకున్న మార్గదర్శకాల ముసాయిదా(మాన్యువల్)ను ఈ ఏడాది యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 15 అంశాల ముసాయిదాను 2016-17 వాటర్ ఇయర్‌లోనూ అమలు చేయాలని పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల ప్రొటోకాల్ పూర్తిగా బోర్డు చూసుకునేందుకు సమ్మతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గతనెల 27న బోర్డు సమావేశం సందర్భంగా... ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, వినియోగంపై మాన్యువల్ ఎలా ఉండాలన్న అంశంపై ఈ నెల 10లోగా సమాధానం చెప్పాలని బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ముసాయిదాను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని కూడా అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్తే నీటి లభ్యతను బట్టి విడుదలకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలిస్తే.. దాన్ని ఇరు రాష్ట్రాలు అమలు చేయాలి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాల్వ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా సాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలని గత ముసాయిదాలో నిర్ణయించారు. దీంతో పాటే కేసీ కెనాల్, జూరాల, ఆర్డీఎస్లకు నీటి విడుదలను సైతం బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోవైపు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంయుక్త ప్రకటన విడుదల చేయాలని గతంలో బోర్డు సూచించింది. ఇందుకు తెలంగాణ అంగీకరించింది. గతేడాది మాన్యువల్‌నే ప్రస్తుతం అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఇక ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే నోటిఫికేషన్ ఏదీ అవసరం లేదని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
నాలుగు నదుల అనుసంధానం!
* జల్ మంథన్‌లో ముమ్మర చర్చ * మహానది, గోదావరి, కృష్ణా, కావేరి * అనుసంధానంపై అభిప్రాయ సేకరణ * ఏపీ, తెలంగాణలో 24 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి! సాక్షి, న్యూఢిల్లీ: జీవనదుల అభివృద్ధి పథకం కింద మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదులను అనుసంధానించాలని కేంద్రం యోచిస్తోంది. హిమాలయాలేతర జీవ నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 18 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 6 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి వస్తుందని అంచనా. అలాగే ఏపీలో 552 మెగావాట్లు, తెలంగాణలో 975 మెగావాట్ల జలవిద్యుత్‌కు నీటి లభ్యత ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘జల్ మంథన్’లో శుక్రవారం నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నాలుగు నదుల అనుసంధానాన్ని ప్రస్తావించింది. మహానది (మణిభద్ర రిజర్వాయర్)-గోదావరి (ధవళేశ్వరం), గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (పులిచింతల), గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (నాగార్జునసాగర్), గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ), కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా, కృష్ణా (శ్రీశైలం)-పెన్నా, కృష్ణా (నాగార్జునసాగర్)- పెన్నా (సోమశిల), పెన్నా (సోమశిల)-కావేరి (గ్రాండ్ ఆనికట్) ... అనుసంధాన ప్రతిపాదనల్లో ఉన్నాయి. లబ్ధి ఇలా... మహానది (మణిభద్ర)- గోదావరి (ధవళేశ్వరం) అనుసంధానంతో ఏపీ, ఒడిశాల్లో 4.43 లక్షల హెక్టార్లకు అదనంగా సాగు నీరు అందుతుంది. 802 మిలియన్ క్యూబిక్ మీటర్ల (ఎంసీఎం) నీటి లభ్యత ఉంటుంది. 445 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం. గోదావరి (ఇచ్చంపల్లి)-కృష్ణా (పులిచింతల) అనుసంధానం ద్వారా.. ఏపీ, తెలంగాణల్లో 6.13 లక్షల హెక్టార్ల అదనపు సాగుకు అవకాశం. గోదావరి (ఇచ్చంపల్లి)- కృష్ణా (నాగార్జునసాగర్) అనుసంధానంతో.. తెలంగాణలో 2.87 లక్షల హెక్టార్ల భూమి అదనంగా సాగులోకి వస్తుంది. గృహాలు, పరిశ్రమలకు 237 ఎంసీఎంల నీటిని సరఫరా చేయవచ్చు. 975 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం. గోదావరి (పోలవరం)-కృష్ణా (విజయవాడ) అనుసంధానం ద్వారా ఏపీలో 5.82 లక్షల హెక్టార్ల సాగు పెరగడంతో పాటు గృహాలు, పరిశ్రమలకు 162 ఎంసీఎంల నీటిని సరఫరా చేయవచ్చు. కృష్ణా (ఆల్మట్టి)-పెన్నా అనుసంధానంతో ఏపీలో 1.09 లక్షల హెక్టార్లు, కర్ణాటకలో 0.6 లక్షల హెక్టార్లకు అదనంగా సాగు నీరు అందుతుంది. గృహాలు, పరిశ్రమలకు 56 ఎంసీఎంల నీటి సరఫరాకు అవకాశం. కృష్ణా (శ్రీశైలం)-పెన్నా నది అనుసంధానంతో ఏపీలో 17 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి నీటి లభ్యత ఉంటుంది. కృష్ణా (నాగార్జునసాగర్)-పెన్నా (సోమశిల) అనుసంధానంతో ఏపీలో 5.81 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందడంతో పాటు గృహ, పారిశ్రామిక అవసరాలకు 124 ఎంసీఎంల నీటి లభ్యత ఉంటుంది. 90 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తికి అవకాశం. పెన్నా (సోమశిల)-కావేరీ (గ్రాండ్ ఆనికట్) అనుసంధానంతో ఏపీలో 0.49 లక్షల హెక్టార్లకు అదనంగా సాగునీరు అందుతుంది.