‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు! | Telangana asks for Krishna River board draft manual | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!

Published Fri, Jun 10 2016 1:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!

‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!

  • నీటి వినియోగంలో గత ఒప్పందాన్ని కొనసాగించాలన్న తెలంగాణ
  • బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
  • బోర్డు పర్యవేక్షణలో నీటి పంపకాలకు అంగీకారం

  • సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గతేడాది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంతో రూపొందించుకున్న మార్గదర్శకాల ముసాయిదా(మాన్యువల్)ను ఈ ఏడాది యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 15 అంశాల ముసాయిదాను 2016-17 వాటర్ ఇయర్‌లోనూ అమలు చేయాలని పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల ప్రొటోకాల్ పూర్తిగా బోర్డు చూసుకునేందుకు సమ్మతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి.

    గతనెల 27న బోర్డు సమావేశం సందర్భంగా... ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, వినియోగంపై మాన్యువల్ ఎలా ఉండాలన్న అంశంపై ఈ నెల 10లోగా సమాధానం చెప్పాలని బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ముసాయిదాను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ గడువు  శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది.


    నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా..
    గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది.

    నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా..
    గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని కూడా అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్తే నీటి లభ్యతను బట్టి విడుదలకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలిస్తే.. దాన్ని ఇరు రాష్ట్రాలు అమలు చేయాలి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాల్వ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా సాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలని గత ముసాయిదాలో నిర్ణయించారు.

    దీంతో పాటే కేసీ కెనాల్, జూరాల, ఆర్డీఎస్‌లకు నీటి విడుదలను సైతం బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోవైపు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంయుక్త ప్రకటన విడుదల చేయాలని గతంలో బోర్డు సూచించింది. ఇందుకు తెలంగాణ అంగీకరించింది. గతేడాది మాన్యువల్‌నే ప్రస్తుతం అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఇక ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే నోటిఫికేషన్ ఏదీ అవసరం లేదని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement