the management board of the Krishna River
-
ఏపీకీ 47.. తెలంగాణకు 39
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు సెప్టెంబరు నెల అవసరాలకు 47 టీఎంసీలు.. తెలంగాణకు మూడు నెలల అవసరాలకు 39 టీఎంసీలు కేటాయించింది.. ఈ నీటిని రెండు రాష్ట్రాలకు విడుదల చేయడానికి సంబంధించిన షెడ్యూలును బోర్డు త్రిసభ్య కమిటీ శనివారం ఖరారు చేయనుంది. చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరుల ద్వారా రెండు రాష్ట్రాలు వినియోగిస్తోన్న కృష్ణా జలాల లెక్కలు తేల్చేందుకు మరో త్రిసభ్య కమిటీని నియమించింది. కేఆర్ఎంబీ పరిధి, నిర్వహణ, అధికారాలకు సంబంధించిన డ్రాఫ్ట్(ముసాయిదా)పై వారం రోజుల్లోగా అభిప్రాయం చెప్పాలని ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అనుమతి లేకుండా నీళ్లు వినియోగించుకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించింది. శుక్రవారం హైదరాబాద్‌లో జలసౌధలో ఛైర్మన్ రాంశరాణ్ అధ్యక్షతన కృష్ణా బోర్డు సమావేశమైంది. -
త్రిసభ్య కమిటీకి చెప్పకుండానే నీటిని తోడేస్తారా?
-ఇరు రాష్ట్రాలపై బోర్డు ఆగ్రహం - ఒప్పందాలకు విఘాతం అంటూ లేఖ సాక్షి, హైదరాబాద్ కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో తమకు మాటమాత్రమైన చెప్పకుండా,కనీస సమాచారం ఇవ్వకుండా ప్రాజెక్టుల ద్వారా నీటిని తోడుకుంటున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో చేసుకున్న ఒప్పందాలు విస్మరించి నీటిని వాడుకోవడాన్ని తీవ్రంగా పరగణిస్తామని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఇరు రాష్ట్రాలకు బోర్డు వేర్వేరుగా లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హంద్రీనీవా, పోతిరెడ్డిపాటు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా నీటిని మళ్లించుకున్నాయని, ఈ విషయంలో తెలంగాణ ఫిర్యాదు చేసే వరకు తమకే ఆ విషయమే తెలియలేదని లేఖలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులకు నీటిని వాడుకుంటున్నామన్న కనీస సమాచారం ఇవ్వలేదని, నీటి వాడకంపై త్రిసభ్య అనుమతి తీసుకోవాలని గత ఒప్పందాల సందర్భంగా నిర్ణయించినా వాటిని ఉల్లంఘించి నీటిని వాడుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ నీటి వినియోగాన్ని బోర్డు తప్పుపట్టింది. జూరాల నుంచి కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడులకు తెలంగాణ నీటిని వాడుకుంటోందని, ఆ నీటి వాడకాన్ని తమకు తెలుపలేదని పేర్కొంది. అనుమతి లేకుండా, త్రిసభ్య కమిటీలో చర్చించకుండా నీటి వాడకాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. ఇప్పటికే ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ వద్ద కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని సూచించింది. దీంతో పాటే ప్రాజెక్టుల వారీ నీటి పరిస్థితులు, ఇరు రాష్ట్రాల అవసరాలు, మైనర్ ఇరిగేషన్ కింద వినియోగిస్తున్న నీటిపై వివరాలు ఏ రాష్ట్రం ఇవ్వలేదని, ఇప్పటికై దీనిపై స్పందించాలని సూచించింది. -
‘కృష్ణా’ ముసాయిదా కొనసాగింపు!
నీటి వినియోగంలో గత ఒప్పందాన్ని కొనసాగించాలన్న తెలంగాణ బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ బోర్డు పర్యవేక్షణలో నీటి పంపకాలకు అంగీకారం సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి గతేడాది కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ మధ్యవర్తిత్వంతో రూపొందించుకున్న మార్గదర్శకాల ముసాయిదా(మాన్యువల్)ను ఈ ఏడాది యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలిపింది. గతంలో రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన 15 అంశాల ముసాయిదాను 2016-17 వాటర్ ఇయర్‌లోనూ అమలు చేయాలని పేర్కొంది. నదీ పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టుల నీటి విడుదల ప్రొటోకాల్ పూర్తిగా బోర్డు చూసుకునేందుకు సమ్మతించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం గురువారం సాయంత్రం కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్లుగా నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. గతనెల 27న బోర్డు సమావేశం సందర్భంగా... ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదల, వినియోగంపై మాన్యువల్ ఎలా ఉండాలన్న అంశంపై ఈ నెల 10లోగా సమాధానం చెప్పాలని బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. ముసాయిదాను యథావిధిగా కొనసాగించడమా? ఏవైనా మార్పులు చేయాలా? అన్న దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ గడువు శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం గురువారం తన అభిప్రాయాన్ని తెలుపుతూ బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాకు లేఖ పంపింది. ఇందులో గత ఏడాది తీసుకున్న నిర్ణయాలను పొందుపరిచింది. నీటి పంపకాలు, పర్యవేక్షణ ఇలా.. గతేడాది నిర్ణయాల ప్రకారం.. ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలను వాడుకోవాలి. 811 నికర జలాలు పోగా మిగులు జలాలు ఉంటే వాటిని కూడా అదే నిష్పత్తి ప్రకారం పంచుకోవాలి. ప్రాజెక్టుల వారీగా నీటి అవసరాలు గుర్తించి విడుదల చేసేందుకు బోర్డు సభ్య కార్యదర్శి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ఈఎన్సీలతో వర్కింగ్ గ్రూపు ఏర్పాటు చేయాలి. ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి అవసరాలపై ఈ కమిటీకి ప్రతిపాదనలు వెళ్తే నీటి లభ్యతను బట్టి విడుదలకు అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది. ఈ సిఫార్సులకు అనుగుణంగా బోర్డు తగిన ఆదేశాలిస్తే.. దాన్ని ఇరు రాష్ట్రాలు అమలు చేయాలి. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఏపీకి కుడి కాల్వ ద్వారా 132 టీఎంసీలు, ఎడమ కాల్వ ద్వారా 32 టీఎంసీలు విడుదల చేయాలి. ఎడమ కాల్వ ద్వారా తెలంగాణకు 100 టీఎంసీలు నీటి విడుదల చేయాలి. మొత్తంగా సాగర్ కెనాల్ వ్యవస్థ ద్వారా 264 టీఎంసీల నీటిని విడుదల చేయాలని గత ముసాయిదాలో నిర్ణయించారు. దీంతో పాటే కేసీ కెనాల్, జూరాల, ఆర్డీఎస్లకు నీటి విడుదలను సైతం బోర్డే స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. మరోవైపు సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సంయుక్త ప్రకటన విడుదల చేయాలని గతంలో బోర్డు సూచించింది. ఇందుకు తెలంగాణ అంగీకరించింది. గతేడాది మాన్యువల్‌నే ప్రస్తుతం అమలు చేయాలని కోరుతున్న నేపథ్యంలో ఇక ప్రాజెక్టులను బోర్డు నియంత్రణలోకి తెచ్చుకునే నోటిఫికేషన్ ఏదీ అవసరం లేదని తెలంగాణ భావిస్తోంది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం కేంద్రం వద్ద ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో.. ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉందని తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొంటున్నారు.