యూనిట్ బ్రేకర్లు ప్యాడ్ల మార్పు
హాట్‌లైన్ సిబ్బంది సాహసం
ముత్తుకూరు
నేలటూరులోని ఏపీజెన్కో ప్రాజెక్టులోని 800 మెగావాట్ల స్విచ్‌యార్డులో కరిగిపోయి, దెబ్బతిన్న యూనిట్ బ్రేకర్ ప్యాడ్లను బుధవారం సాహసంతో హాట్‌లైన్ సిబ్బంది తొలగించి, కొత్తవి అమర్చారు. విజయవాడ £ý ర్మల్ విద్యుత్కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక హాట్‌లైట్ సిబ్బంది శ్రీనివాసరావు, శ్రీనివాస్‌లు విద్యుత్ సరఫరా జరుగుతుండగానే ఈ సాహసం ప్రదర్శించారు. రూ.2 లక్షల విలువైన ప్రత్యేక సూట్ ధరించి, ఎల్తైన చోట ఉత్కంఠ పరిస్థితిలో ఆన్లైన్లో కరిగిపోయిన ప్యాడ్లను తొలగించి, కొత్తవి అమర్చారు. ఈ సాహసకృత్యాన్ని సీఈ చంద్రశేఖరరాజు, ఎస్ఈలు దేవప్రసాద్, రమేష్ముని, సంబంధిత విభాగపు ఇంజనీరు శ్రీనివాసరావు, ముఖ్యసంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. హాట్‌లైన్ సిబ్బంది నైపుణ్యాన్ని ప్రశంసించారు.