United fighting
-
జోరు తగ్గని సమైక్య పోరు
తిరుపతి, న్యూస్‌లైన్ : జిల్లాలో సమైక్య పోరు ఉధృతమవుతోంది. 93 రోజులైనా ఎన్జీవోలు, వైఎస్సార్సీపీ శ్రేణులు, విద్యార్థులు పట్టువదలని విక్రమార్కుల్లా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వివిధ నిరసన కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించారు. గురువారం తిరుపతి తుడా సర్కిల్లో వైఎస్సార్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు స్థానిక సత్యనారాయణపురానికి చెందిన కార్యకర్తలు హాజర య్యారు. ఎమ్మెల్యే కరుణాక రరెడ్డి వారికి సంఘీభావం ప్రకటించి, కొంత సేపు దీక్షలో కూర్చున్నారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలే దీక్షలు కొనసాగించారు. పుంగనూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు, సమైక్యవాదులు ఎన్టీఆర్ సర్కిల్లో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రవీంద్రభారతి స్కూల్ విద్యార్థులు మానవహారం, రాస్తారోకో నిర్వహించారు. వీఆర్వో మురళి రాఘవేంద్రస్వామి అవతారంలో నిరసన తెలిపారు. సమైక్యవాదులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరులో ఎన్జీవోలు మధ్నాహ్నం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మదనపల్లెలో జ్ఞానోదయ స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ జేఏసీ, మిట్స్‌తో కలసి మల్లికార్జున సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. పుత్తూరులో వెంకటేశ్వర ఐటీఐ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సర్కిల్లో ధర్నా చేపట్టారు. -
జోరు తగ్గని పోరు
జిల్లాలో సమైక్యపోరు జోరు తగ్గడం లేదు. ఉద్యమ జ్వాల రగులుతూనే ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా, జగన్‌కు సంఘీభావంగా యలమంచిలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. వెయ్యికి పైగా బైక్‌లతో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. మునగపాక, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల మీదుగా సుమారు వంద కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. చోడవరం నియోజకవర్గంలోనూ భారీ ర్యాలీ సాగింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఏజెన్సీ 11 మండలాల్లో బంద్ విజయవంతమైంది. -
పొలిటికల్ జేఏసీ సామూహిక సత్యాగ్రహం..
సమైక్యాంధ్రను పరిరక్షించుకోవాలని, రాష్ట్రాన్ని ముక్కలు కానీయరాదని సడలని దీక్షతో జిల్లాలో సమైక్య పోరు కొనసాగుతోంది. జిల్లా అంతటా విభిన్న కోణాల్లో ఆందోళనలు ఆదివారం నిర్వహించారు. విజయవాడలో గాంధీ, అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు తదితరుల వేషధారణలతో కళాకారులు ర్యాలీ జరిపి సమైక్యాంధ్ర ఆకాంక్షను వ్యక్తం చేశారు. జగ్గయ్యపేటలో వంద లారీలతోభారీ ర్యాలీ నిర్వహించారు. విచిత్ర వేషధారణలు, వంటావార్పు, మానవహారాలు, భారీ ప్రదర్శనలు జిల్లా అంతటా కొనసాగాయి. సాక్షి, విజయవాడ : జిల్లాలో సమైక్యనాదం మార్మోగుతోంది. ఆదివారం నాడూ జిల్లా అంతటా ఆందోళనలు కొనసాగాయి. జగ్గయ్యపేట ఆటోనగర్ లారీ ఓనర్స్, మెకానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన పట్టణ పౌరులను విశేషంగా ఆకట్టుకుంది. సుమారు 100కు పైగా లారీలతో వారు చేపట్టిన ర్యాలీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ర్యాలీలో ముందుగా ఏర్పాటుచేసిన జేసీబీపై కేసీఆర్ కటౌట్ ఉంచి దానిని చెప్పులతో, చీపురుతో కొట్టుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ ఉదయభాను, ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, మాజీ మంత్రి నెట్టెం రఘురాం తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుడివాడలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిపారు. మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆందోళనకు మద్దతు ప్రకటించి నిరసనలో పాల్గొన్నారు. గుడివాడలో ఓల్డ్ ఐరన్ మర్చంట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన వంటావార్పూ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొని సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ సీపీ పెనమలూరు నియోజకవర్గ సమన్వయక ర్త పడమట సురేష్‌బాబు ఆధ్వర్యంలో కంకిపాడులో అర్ధనగ్న ప్రదర్శన, బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద ఓగిరాల గ్రామంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బళ్లారి చిట్టిబాబు ఆదివారం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. తిరువూరులో సమైక్య జేఏసీ ఆధ్వర్యంలో రాజుపేట నుంచి ప్రధాన వీధుల గుండా బోస్ సెంటరు, బైపాస్ రోడ్డు వరకు మోటారు సైకిళ్లపై నిరసన ప్రదర్శన జరిపారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆదివారం మైలవరం బోసుబొమ్మ సెంటర్ నుంచి నూజివీడు రోడ్డులోని వినాయకుని గుడి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అక్కడ మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉయ్యూరులో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచేవిధంగా సోనియాగాంధీకి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రైవేట్ స్కూల్ జేఏసీ కన్వీనర్ డాక్టర్ పరుచూరి శ్రీనివాసరావు చెప్పులు కుట్టి నిరసన తెలియజేశారు. ఇబ్రహీంపట్నంలో విద్యుత్తు ఉద్యోగులు ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పొలిటికల్ జేఏసీ సామూహిక సత్యాగ్రహం.. పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో విజయవాడ సబ్‌కలెక్టర్ ఆఫీసు వద్ద సామూహిక సత్యాగ్రహం నిర్వహించారు. కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్లో వైఎస్సార్ సీపీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. కళాకారులు గాంధీనగర్ నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీ జరిపారు. మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ తదితర వేషధారణలతో నిర్వహించిన ఈ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. బిజీబిజీగా వివిధ అసోసియేషన్ల నేతలు నిరవధిక సమ్మె చేయడానికి కొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉండటంతో ఆదివారం వివిధ అసోసియేషన్ల నాయకులంతా బిజీబిజీగా గడిపారు. విజయవాడలో మున్సిపల్ జేఏసీ నాయకులు సమావేశమై 12 నగరపాలక సంస్థ, 102 మున్సిపాలిటీలకు చెందిన 25 వేల మంది ఉద్యోగస్తులు సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించారు. మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి అత్యవసర సేవల్ని మాత్రం యథాతథంగా కొనసాగిస్తామన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు సమావేశమై సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించారు. -
సమైక్య పోరు నిరసనల హోరు
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కళ్లుమూసుకున్నారా? అంటూ జనం పాలకులపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా అన్ని రకాల కుల వృత్తులు, వ్యాపార, కార్మిక, సేవా రంగాలకు చెందిన అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో రోజు సమైక్యవాదులు కదం తొక్కారు. సాక్షి, తిరుపతి : సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జిల్లాలోని రెవెన్యూ, ఎంపీడీవో, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రెవెన్యూ, పల్లె పాలనను చూసుకునే మండల పరిషత్‌లు, నగర పాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్నారు. వైద్యశాలకు తాళాలు సమైక్య ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో రుయా, స్విమ్స్, పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళనలు చేస్తు న్న ఉద్యమకారులకు సంఘీభావం తెలియజే స్తూ సమైక్యవాదులకు అండగా నిలుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కలిసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. వినోదానికి బ్రేక్ ఉద్యమంలో జనం కీలకపాత్ర పోషిస్తుండటంతో వినోదాలకు బ్రేక్ ఇచ్చారు. జిల్లాలోని సినిమా హాళ్లు మూసివేశారు. టీవీలో ఎంటర్టైన్మెంట్ చానళ్లను కూడా నిలిపేసి కేబుల్ నెట్వర్క్ యూనియన్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులు గా టీవీలో ప్రసారాలు రావటం లేదు. వ్యాపార వర్గాలన్నీ షాపులు మూసివేసి ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. ఎనిమిదవ రోజు కొనసాగిన ఆందోళనలు జిల్లాలో ఎనిమిదవరోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తాళాలువేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపించారు. చంద్రగిరిలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మకు చీర, పసుపు, కుంకు మ, గాజులు, పూలతో సారెపెట్టి మహిళలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో అంధులు సమైక్యాంధ్ర కోసం నగర ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించి బంద్ నిర్వహించారు. సత్యవేడులో సమైక్యవాదులు ఏ చిన్నవాహనా న్ని కూడా వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాలాజీ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో క్రీడాకారులు స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొడుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓలు తిరుపతిలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి కళాకారులతో కలసి గద చేతబట్టి ఆం దోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు విన్నూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వీయులో విద్యార్థుల ఆమరణ నిరాహరదీక్షలు కొనసాగాయి. మెడికల్ కళాశాల ముం దు డాక్టర్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మాజీ కౌన్సిలర్లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిం చారు. కాంగ్రెస్ సెలూన్లో కటింగ్ కోసం వచ్చిన సీఎం కిరణ్, బొత్స, కావూరిలకు గుండు కొట్టి పంపించటా న్ని ఒక చిత్రకారుడు గీసి చూపించారు. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ యజమానులు టీవీలకు పలువురు విభజన పరుల చిత్రాలను అంటించి రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు.