సమైక్య పోరు నిరసనల హోరు
Published Thu, Aug 8 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే కళ్లుమూసుకున్నారా? అంటూ జనం పాలకులపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర విభజనను ఒప్పుకునేది లేదని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు తాళాలు వేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపిస్తున్నారు. పార్టీలకతీతంగా అన్ని రకాల కుల వృత్తులు, వ్యాపార, కార్మిక, సేవా రంగాలకు చెందిన అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర ఫ్లెక్సీలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ, రాస్తారోకో, ధర్నా, మానవహారాలు నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. జిల్లాలో ఎనిమిదో రోజు సమైక్యవాదులు కదం తొక్కారు.
సాక్షి, తిరుపతి : సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. జిల్లాలోని రెవెన్యూ, ఎంపీడీవో, మునిసిపల్ కార్పొరేషన్, విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రెవెన్యూ, పల్లె పాలనను చూసుకునే మండల పరిషత్‌లు, నగర పాలక సంస్థలు, మున్సిపల్ సిబ్బంది మూకుమ్మడిగా సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు తాళాలు వేసి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ‘జై సమైక్యాంధ్ర’ అంటూ ఉద్యమిస్తున్నారు.
వైద్యశాలకు తాళాలు
సమైక్య ఉద్యమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లు, సిబ్బంది రోడ్డెక్కారు. తిరుపతి నగరంలో రుయా, స్విమ్స్, పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఆందోళనలు చేస్తు న్న ఉద్యమకారులకు సంఘీభావం తెలియజే స్తూ సమైక్యవాదులకు అండగా నిలుస్తున్నారు. వైద్యులు, సిబ్బంది కలిసి ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు.
వినోదానికి బ్రేక్
ఉద్యమంలో జనం కీలకపాత్ర పోషిస్తుండటంతో వినోదాలకు బ్రేక్ ఇచ్చారు. జిల్లాలోని సినిమా హాళ్లు మూసివేశారు. టీవీలో ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లను కూడా నిలిపేసి కేబుల్ నెట్‌వర్క్ యూనియన్లు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొంటున్నారు. మూడు రోజులు గా టీవీలో ప్రసారాలు రావటం లేదు. వ్యాపార వర్గాలన్నీ షాపులు మూసివేసి ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు.
ఎనిమిదవ రోజు కొనసాగిన ఆందోళనలు
జిల్లాలో ఎనిమిదవరోజు కూడా సమైక్యాంధ్ర ఉద్యమాలు కొనసాగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తాళాలువేసి విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డుపైకొచ్చి సమైక్య గళం వినిపించారు. చంద్రగిరిలో కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి దిష్టిబొమ్మకు చీర, పసుపు, కుంకు మ, గాజులు, పూలతో సారెపెట్టి మహిళలు నిరసన తెలియజేశారు. తిరుపతిలో అంధులు సమైక్యాంధ్ర కోసం నగర ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో ఎమ్మెల్యే సీకేబాబు ఆధ్వర్యంలో షాపులను మూయించి బంద్ నిర్వహించారు. సత్యవేడులో సమైక్యవాదులు ఏ చిన్నవాహనా న్ని కూడా వీధుల్లో తిరగనివ్వకుండా అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా బాలాజీ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు.
పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతిలో క్రీడాకారులు స్విమ్మింగ్ ఫూల్లో ఈతకొడుతూ విన్నూత్న రీతిలో నిరసన తెలియజేశారు. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్‌ఓలు తిరుపతిలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి కళాకారులతో కలసి గద చేతబట్టి ఆం దోళనలో పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు విన్నూత్నంగా నిరసన తెలియజేశారు. తిరుపతి ఎస్వీయులో విద్యార్థుల ఆమరణ నిరాహరదీక్షలు కొనసాగాయి.
మెడికల్ కళాశాల ముం దు డాక్టర్లు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. నాలుగుకాళ్ల మండపం వద్ద మాజీ కౌన్సిలర్లు రిలే నిరాహారదీక్షలు కొనసాగిం చారు. కాంగ్రెస్ సెలూన్‌లో కటింగ్ కోసం వచ్చిన సీఎం కిరణ్, బొత్స, కావూరిలకు గుండు కొట్టి పంపించటా న్ని ఒక చిత్రకారుడు గీసి చూపించారు. శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్ యజమానులు టీవీలకు పలువురు విభజన పరుల చిత్రాలను అంటించి రోడ్డుపై పగులగొట్టి నిరసన తెలిపారు.
Advertisement
Advertisement