ఉద్యోగాల పేరుతో టోకరా!
* 19 లక్షలకు కుచ్చుటోపీ..
ఖమ్మం క్రైం: ఐక్యరాజ్య సమితి జిల్లా ప్రతినిధి ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి యువతకు టోకరా వేశాడు. సూటుబూటు వేసుకొని ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను బురిడీ కొట్టిస్తున్నాడు. రూ.19 లక్షలకు కుచ్చుటోపి పెట్టి తప్పించుకు తిరుగుతున్న ఆయన మోసాన్ని ఖమ్మం డీఎస్పీ సురేష్‌కుమార్ బట్టబయలు చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో మోసగాడి వివరాలు వెల్లడించారు.
మోసగాడి ప్రస్థానం ఇలా..
హైదరాబాద్‌లోని గన్‌ఫౌండ్రీ అబిడ్స్‌కు చెం ది న మైనంపాటి సునీల్‌కుమార్ (సుబ్రమణ్యం) 2000లో ప్రైవేట్ ఆర్గనైజేషన్ యునెటైడ్ స్కూల్ ఆఫ్ ఇండియా మెంబర్‌గా సభ్యత్వం పొందాడు. తాను యూఎన్వో(ఐక్యరాజ్య సమితి) ఎన్జీవోను అని చెప్పుకునేవాడు.
స్కూల్స్‌లో జీకే, ఇన్ఫర్మేషన్ టెస్టులు నిర్వహిం చేవాడు. 2008లో అప్పటి డీఈవో, కలెక్టర్‌ను కలసి యూఎన్వో రీజినల్ డెరైక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని తన పని సులువు చేసుకున్నా డు. నెమ్మదిగా జూబ్లీపురలోని కలెక్టర్ బంగ్లా పక్కనే ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాడు. వచ్చిపోయేవారికి ఈ బంగ్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని నమ్మబలికేవాడు.
2013 జనవరి 25న ఎలక్షన్వాచ్ కన్వీనర్‌గా పనిచేసిన సునీల్‌కుమార్ ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఇతని ప్రసంగంతో ముగ్ధుడైన బోనకల్ మండలానికి చెం దిన రామాంజనేయులు సునీల్‌తో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రామాంజనేయులు నుంచి రూ.లక్ష వసూలు చేశాడు.
అతని ద్వారా ఆరుగురి నుంచి రూ.19 లక్షల వరకు వసూలు చేశాడు. యునెటైడ్ నేషనల్ కౌన్సెల్ ఫర్ ఆంధ్రప్రదేశ్ పేరుతో నకిలీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి కొంతకాలం నిరుద్యోగులను నమ్మించాడు. ఓ ఏడుగురికి సెక్రటరీ జనరల్ యునెటైడ్ నేషనల్ కౌన్సెల్ పేరుతో ఐడీ కార్డులూ జారీ చేశా డు. రెండు నెలలుగా వేతనం చెల్లించకపోవడం తో అభ్యర్థులు పోలీసులను ఆశ్రయించారు.