United Nations Human Development Report
-
Ukraine-Russia war: రష్యాకు లక్ష, మాకు 13 వేలు సైనిక నష్టంపై ఉక్రెయిన్
కీవ్: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా ప్రాణనష్టం చోటు చేసుకుంటోంది. యుద్ధం మొదలైన ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపుగా 13 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదార మైఖైలో పోడోల్యాక్ వెల్లడించారు. వీరిలో సాధారణ పౌరులే అధికమన్నారు. రష్యా సైనికులు లక్ష మంది దాకా మరణించినట్టు అంచనా వేశామన్నారు. లక్షన్నర మంది గాయపడి ఉంటారని తెలిపారు. ఉక్రెయిన్ వైపు చనిపోయిన, గాయపడ్డ వారి సంఖ్య లక్ష దాకా ఉంటుందని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండెర్ లెయెన్ చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ రెండు పక్షాల్లో కలిపి మృతుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మార్క్ మిల్లీ అన్నారు. ఉక్రెయిన్ పౌరులు 40 వేల మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇక ఇరువైపులా కలిపి 6,655 మంది పౌరులు మరణించారని, 10, 368 మంది గాయపడ్డారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. సైనికులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో ఐరాస వెల్లడించలేదు. -
ఆ నివేదిక కట్టుకథ..
జెనీవా : జమ్ము కశ్మీర్లో సీనియర్ జర్నలిస్టు షుజత్ బుఖారి, ఆర్మీ జవాన్ ఔరంగజేబ్‌ల హత్యను భారత్ ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రస్తావించింది. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్న అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేసింది.సరిహద్దు ఉగ్రవాదమే ప్రజల గొంతుకను తొక్కిపెడుతోందని, గత వారం సీనియర్ జర్నలిస్టు సహా భద్రతా అధికారులు, జవాన్‌ను ఉగ్ర మూకలు పొట్టనపెట్టుకున్నాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ కే చందర్ స్పష్టం చేశారు. కాగా కశ్మీర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, వీటిపై అంతర్జాతీయ విచారణ చేపట్టాలని ఐక్యరాజ్యసమితి గతవారం ఓ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ నివేదిక అసత్యాలతో దురుద్దేశపూరితంగా రూపొందిందని భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ధ్రువీకరించని సమాచారంతో ఈ నివేదికను వెల్లడించడం వెనుక ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ఉద్దేశాన్ని ప్రశ్నించింది. -
వేగంగా వృద్ధి చెందుతున్నా..ఎన్నెన్నో వెనుకడుగులు!
భారత్‌పై ఐరాస మానవ వనరుల నివేదిక న్యూఢిల్లీ: దక్షిణాసియాలోని పలు ఇరుగుపొరుగు దేశాలతో పోల్చితే పలు ఆర్థిక, సామాజిక రంగాల్లో భారత్ వెనుకబడి ఉందని ఐక్యరాజ్య సమితి రూపొందించిన 2015 మానవ అభివృద్ధి నివేదిక ఒకటి తెలిపింది. నివేదిక దక్షిణ ఆసియాలో ఇరాన్‌ను కూడా కలిపింది. 2005-2014 మధ్య వివిధ అంతర్జాతీయ సంస్థలు సేకరించిన సమాచారం ప్రాతిపదికన ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం చూస్తే... 2013లో భారత్ తలసరి ఆదాయం 5,238 డాలర్లు. ఇది ఇరాన్లో పోల్చితే 65% తక్కువ. మాల్దీవులతో (11,238 డాలర్లు) పోల్చిచూస్తే 54% తక్కువ. శ్రీలంకతో (9,426 డాలర్లు)తో పోల్చి చూసినా 44% తక్కువ. భూటాన్‌తో పోల్చితే 27% (7,167 డాలర్లు) తక్కువ. 2002-2012 లెక్క ప్రకారం రోజుకు 1.25 డాలర్ల కొనుగోలు శక్తి సామీప్యత (పీపీపీ) ప్రాతిపదికన దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజల సంఖ్య భూటాన్‌లో 2.4%. మాల్దీవుల్లో 6.3%. పాకిస్తాన్లో 12.7%. భారత్‌లో 23.6%. నేపాల్‌లో 23.7%. 43.3%తో బంగ్లాదేశ్ అట్టడుగున ఉంది. కాగా 2015 అక్టోబర్‌లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ‘ఇండియా స్పెండ్ రిపోర్ట్’ ప్రకారం, 2011-12లో 21 %గా ఉన్న భారత్ పేదరికం రేటు..ఇప్పుడు 12.4%కి తగ్గింది.