విశ్వం నిర్మాణాన్ని తెలిపే నూతన మ్యాప్
వాషింగ్టన్: విశ్వం నిర్మాణానికి సంబంధించిన తొలి మ్యాప్‌ను ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ మ్యాప్ రూపకల్పనలో విశ్వవ్యాప్తంగా ఉన్న క్వాసార్స్ అనే ప్రకాశవంతమైన నక్షత్రాల్లాంటి నిర్మాణాలను ఖగోళ శాస్త్రవేత్తలు వాడారు. ‘ఈ క్వాసార్స్ అనేవి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రాల లాంటి నిర్మాణాలు, ఇవి విశ్వమంతటా ఉన్నాయి. పెద్ద పెద్ద కృష్ణబిలాల వల్ల ఈ క్వాసార్స్లో కాంతి ఉద్భవించింది.
క్వాసార్స్ అత్యంత కాంతివంతమైనవి కావున విశ్వవ్యాప్తంగా వీటిని మనం చూడవచ్చు. ప్రస్తుతం తాము ఈ క్వాసార్స్ సాయంతోనే విశ్వానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించగలిగాము’అని అమెరికాలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఆష్టే రాస్ వెల్లడించారు.