సెమిస్టర్ పరీక్షలకు 77 మంది గైర్హాజరు
తెయూ(డిచ్పల్లి), న్యూస్‌లైన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న పీజీ సెమిస్టర్ పరీక్షలకు బుధవారం రెండో రోజు 77 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ నసీం తెలి పారు. తెయూ ప్రధాన క్యాంపస్‌తో పాటు భిక్కనూర్ సౌత్ క్యాం పస్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి, బోధన్, బాన్సువాడ కేంద్రాల్లో జరుగుతున్న సెమిస్టర్ పరీక్షల్లో మొత్తం 1,449 మందికి గాను 1,372 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరైనట్లు ఆమె తెలిపారు. ప్రధాన క్యాంపస్‌లో పరీక్షా కేంద్రాన్ని బుధవారం ప్రిన్సిపల్ కనకయ్య, వైస్ ప్రిన్సిపల్ మమత సందర్శించారు.